గాలివాన (కథ): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
ప్రముఖ కథారచయిత, సినీరచయిత పాలగుమ్మి పద్మరాజు రచించిన కథ '''గాలివాన'''. ధనికుడు, సంఘంలో పేరుప్రతిష్టలు ఉన్నవారు అయిన రావుగారికీ, దొంగ, బిచ్చగత్తె అయిన ఓ స్త్రీకి నడుమ గాలివానతో రైల్వేస్టేషనులో చిక్కుకుపోయిన రాత్రిని గాలివానలో చిత్రీకరించారు. ఈ కథకు పద్మరాజు చేసిన అనువాదం ''ద రెయిన్''కు 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీలో ద్వితీయ బహుమతి లభించింది. అలా ప్రపంచస్థాయిలో తెలుగు కథని నిలిపినదిగా గాలివాన తెలుగు సాహిత్యరంగంలో సుప్రఖ్యాతమైంది.
== కథా నేపథ్యం ==
గాలివాన కథని పాలగుమ్మి పద్మరాజు ప్రముఖ రష్యన్ రచయిత ''[[మాక్సిం గోర్కీ|గోర్కీ]]'' రాసిన ''ద ఆటమ్ నైట్'' కథ నుంచి స్వీకరించారని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయితే ఆ కథలో లేని దృక్పథాల వైరుధ్యం, మార్పు వంటివి చేరుస్తూ కథను అద్భుతంగా మలిచారని భావించారు.<ref name="గాలివానపై ప్రభావాలు ఖదీర్" /> 1949లో పద్మరాజు భీమవరంలో ఉండగా విపరీతమైన గాలివాన వచ్చి ఆయన నివాసం ఉంటున్న ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఉందామా, బయటకు పారిపోదామా అని ఊగిసలాడుతూన్న సమయంలో పద్మరాజు బయటకి రావడం, భార్య ఇంట్లోనే ఉండిపోవడంతో ఇల్లు ఆమెపై కూలిపోయింది. కాపాడేందుకు వచ్చిన ఆయన విద్యార్థుల సహాయంతో ఆమెను బయటకు తీసుకువచ్చారు. చివరకు ఆమె బతికిందో లేదో, బ్రతికేవుంటే బతుకుతుందో బతకదో కూడా తెల్లారేవరకూ తెలియని దుస్థితిలో ఆ రాత్రి గడపాల్సివచ్చింది. ఆమె శరీరమంతా గాయాలతో చాన్నాళ్ళు కోలుకోలేని స్థితిలోకి వెళ్లారు. ఈ దుర్భరమైన అనుభవం నుంచే కథలోని గాలివాన చిత్రణ, గాలివాన రాత్రి ప్రధాన పాత్ర పొందిన వేదన, భయం వంటివాటి చిత్రణను స్వయంగా తన జీవితం నుంచే స్వీకరించివుండొచ్చని సాహిత్యకారుడు, పాత్రికేయుడు [[నరిశెట్టి ఇన్నయ్య]] పేర్కొన్నారు. <ref name="నరిశెట్టి ఇన్నయ్య-పద్మరాజు">{{cite web|last1=నరిశెట్టి|first1=ఇన్నయ్య|title=సాహిత్యపరులతో సరసాలు|url=http://naprapamcham.blogspot.in/2008/07/blog-post_26.html|website=నా ప్రపంచం|publisher=నరిశెట్టి ఇన్నయ్య|accessdate=5 June 2015}}</ref>
 
== ఇతివృత్తం ==
"https://te.wikipedia.org/wiki/గాలివాన_(కథ)" నుండి వెలికితీశారు