"తెలంగాణ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
[[File:Telangana montage1.png|thumb|తెలంగాణ ప్రాంతం చిత్రమాలిక]]
భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి '''తెలంగాణ'''. దేశానికి 1948స్వాతంత్ర్యం సెప్టెంబరువచ్చిన 17నతర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది [[హైదరాబాదు]] రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]] లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి [[ఆంధ్ర రాష్ట్రం]] తో కలిసి [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది [[దక్కను పీఠభూమి]] లో భాగము. దేశంలోనే పొడవైన 44వ నెంబరు ([[శ్రీనగర్]]-[[కన్యాకుమారి]]) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 [[కన్యాకుమారి]]-[[వారణాసి]] మరియూ జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, [[నిజామాబాదు]]-[[జగదల్‌పూర్]] జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, సికింద్రాబాదు-డోన్, [[వికారాబాదు]]-పర్బని,కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు [[దక్షిణ మధ్య రైల్వే]] లో ప్రముఖ కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి రామాయణ కర్త [[గోన బుద్ధారెడ్డి]], సహజకవి [[బమ్మెర పోతన]], దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు [[రుద్రమదేవి]], ప్రధానమంత్రిగా పనిచేసిన [[పి.వి.నరసింహారావు]] తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన [[అశ్మక జనపదం]] విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా [[ఆలంపూర్]] లో 5వ శక్తిపీఠం, మల్దకల్ శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, [[భద్రాచలం]] లో శ్రీసీతారామాలయం, [[బాసర]] లో సరస్వతీ దేవాలయం, [[యాదగిరి గుట్ట]] లో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, [[వేములవాడ]] లో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం,మెదక్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి.<ref>సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి భాగము(1958), పేజీ 358</ref> దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై [[శ్రీకృష్ణ కమిటీ]] ని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు [[భాజపా]] మద్దతుతో లోకసభ ఆమోదం లభించగా, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. మార్చి 1, 2014న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 05-03-2014</ref> జూన్ 2, 2014 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది:03-06-2014</ref><ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది:03-06-2014</ref>
 
=== భౌగోళిక స్వరూపం ===
పురాతన రాతియుగం నుంచే తెలంగాణ ప్రాంతం ఉనికిని కలిగియుంది. పూర్వ రాతియుగం కాలం నాటి ఆవాసస్థలాలు వేములపల్లి, [[ఏటూరునాగారం]], [[బాసర]], [[బోథ్]], [[హాలియా]], [[క్యాతూర్]] తదితర ప్రాంతాలలో బయటపడ్డాయి. వాడపల్లి, వెల్టూరు, పోచంపాడు, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాలలొ బృహశ్శిలాయుగం నాటి ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు.<ref>తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, పేజీ 20</ref> షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం [[అశ్మక జనపదం]] ఈ ప్రాంతంలోనిదే. పోదన్ (నేటి [[బోధన్]]) దీని రాజధానిగా ఉండింది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైయుంది. [[గౌతమ బుద్ధుడు|బుద్ధుడి]] కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి (ఆదిలాబాదు జిల్లాలో నదీద్వీపం) గా పిలుబడుతున్నది. మత్స్యపురాణంలో మంజీరక దేశం (నేటి [[మంజీరా నది]] పరీవాహప్రాంతం) ప్రస్తావన కూడా ఉంది.<ref>ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి, రచన:పి.రామశర్మ</ref> ప్రతిష్టానపురం (పైఠాన్) రాజధానిగా పాలించిన ములక రాజ్యం [[గోదావరి నది]] సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాదు జిల్లా ప్రాంతం భాగంగా ఉండింది. అప్పుడు ఉత్తర-దక్షిణ ప్రధానమార్గం ఈ రాజ్యం గుండా ఉండేది.<ref>A History of South India, K.A.Neelakanta Shastry, P 65</ref> విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకమని పిలిచారు (నేటి [[మంజీరా నది]] పరీవాహక ప్రాంతం).<ref>ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి, పి.రామశర్మ</ref> షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు.
 
'''మౌర్యుల కాలం''':మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు [[మెగస్తనీసు]] ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ ([[కరీంనగర్]]), పౌదన్యపురం (బోధన్), పిధుండ, ముషిక, [[ధూళికట్ట]], [[పెద్దబొంకూర్]], [[ఫణిగిరి]], [[కొండాపురం]], [[కోటిలింగాల]], గాజులబండ ముఖ్యమైనది.<ref>ఆంధ్రుల చరిత్ర, బి.ఎస్.ఎల్.హన్మంతరావు, పేజీ 52</ref> ఇవన్నీ నేటి తెలంగాణ ప్రాంతంలోనివేరాష్ట్రంలోనివే. ఇంకనూ బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.<ref>ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఏటుకూరి బలరామమూర్తి, పేజీ 17</ref> మెగస్తనీసు ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్రరాజ్యం బహుశా ములక అస్సక లేదా ప్రతిష్టాన రాజ్యమే అయి ఉంటుందని ప్రముఖ చరిత్రకారుడు బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేర్కొన్నారు.<ref>తెలంగాణ చరిత్ర, రచన:సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 37</ref>
 
'''శాతవాహనుల కాలం''': [[శాతవాహనులు|శాతవాహనుల]] కాలంలో కోటిలింగాల ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా ఇదే. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్టానపురం మరియు ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల మరియు దాని పరిసరాలలో లభ్యమయ్యాయి. కాబట్టి శాతవాహనుల తొలి కేంద్రస్థానం [[గోదావరి]] తీరంలోని తెలంగాణ ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు.<ref>తెలంగాణ చారిత్రక భౌగోళం, జి.రాంబాబు, పేజి 102</ref> శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలులేవు. విజయపురి కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకాటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్ర్యంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు. ఈ విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు.<ref>తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 69</ref> ఇంద్రపాలనగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసరలోని రామలింగేశ్వర, షాద్‌నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివి.
 
[[దస్త్రం:Mahabubnagar Toorpu Kaman.JPG|thumb|left|170px|<center>పాలమూరు పట్టణంలో విమోచనోద్యమానికి గుర్తుగా ఉన్న తూర్పుకమాన్</center>]]
'''తెలంగాణ విమోచనోద్యమం''': [[1947]], [[ఆగస్టు 15]]న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినను తెలంగాణ ప్రాంతం నిజాం పరిపాలనలోని హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. తరువాత పోలీసు చర్య ద్వారా [[1948]], [[సెప్టెంబరు 17]]ఇది భారతదేశంలో కలపబడినది, ఈ పోరాటంలో ([[తెలంగాణ విమోచనోద్యమం]], [[తెలంగాణా సాయుధ పోరాటం]]) నాటి [[రజాకార్ల]] దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించినది. 1948 నుంచి హైదరాబాదు రాష్ట్రంగా కొనసాగించికొనసాగింది. వెల్లోడి మరియు బూర్గుల రామకృష్ణారావు ఈ కాలంలో ముఖ్యమంత్రులుగావ్యవహరించారు.
 
'''1956 తర్వాత:''' [[1956]]లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన జరుగగా హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు మరియు ఆంధ్రరాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. వరంగల్లు నుండి కొంత ప్రాంతాన్నీ, గోదావరి జిల్లాలనుండి భద్రాచలం, దండకారణ్యం ప్రాంతాలకు వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరచినారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో [[మర్రి చెన్నారెడ్డి]] నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన [[తెలంగాణ ప్రజా సమితి]] పార్టీ 1971లో 11 లోకసభ స్థానలలో విజయం సాధించింది. 1979లో హైదరాబాదు జిల్లా గ్రామీణ ప్రాంతాన్ని వేరుచేసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేశారు. [[2001]], [[ఏప్రిల్ 27]]న కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని ఏర్పాటు చేశారు. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం "ఐక్య కార్యాచరణ సమితి" చేతుల్లోకి వెళ్ళడంతో విద్యార్థులు, ఉద్యోగసంఘాలు చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటిని నియమించగా ఆ కమిటి 6 ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. జూన్ 2, 2014నాడు దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.
127

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1529437" నుండి వెలికితీశారు