ఐక్యరాజ్య సమితి: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Flag of the United Nations.svg|thumb|right|ఐక్యరాజ్య సమితి పతాకం]]
'''ఐక్యరాజ్య సమితి''' ([[ఆంగ్లం]]: United Nations) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. [[మొదటి ప్రపంచ యుద్ధం]] తరువాత ఏర్పాటు చేసిన [[నానాజాతి సమితి]] (లీగ్ ఆఫ్ నేషన్స్) [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధాన్ని]] నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా [[1945]]లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము [[దేశాల జాబితా - ఐక్య రాజ్య సమితి సభ్యులు|193]] దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: [[అమెరికా]], [[రష్యా]], [[బ్రిటన్]], [[చైనా]] మరియు [[ఫ్రాన్స్]]. ప్రధాన కార్యాలయం [[న్యూయార్క్]] నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన [[అక్టోబరు 24]]వ తేదీని ప్రతి సంవత్సరం '''[[ఐక్యరాజ్య సమితి దినోత్సవం]]''' గా పాటిస్తారు.
 
[[దస్త్రం:United Nations Members.PNG|thumb|300px|ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలను, ఆయా దేశాల ఆధారిత భూభాగాలను (ఐ.రా.స. గుర్తింపు ప్రకారం)చూపే చిత్రపటం. - ఇందులో కలుపనివి : [[అంటార్కిటికా]] (అంటార్కిటికా ఒడంబడిక ప్రకారం నియంత్రింపబడుతున్నది), [[వాటికన్ నగరం]]లేదా [[హోలీ సీ]] (ఐ.రా.స. సాధారణ సభలో అబ్సర్వవర్ హోదా కలిగి ఉన్నది), [[పాలస్తీనా భూభాగాలు]] (ఐ.రా.స. అబ్సర్వర్), [[పశ్చిమ సహారా]] ([[మొరాకో]], [[పోలిసారియో ఫ్రంట్]]ల మధ్య వివాదంలో ఉన్నది), [[తైవాన్]] - ([[చైనా రిపబ్లిక్ (తైవాన్)]] అనబడే దీనిని [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా]]లో ఒక భాగంగా ఐ.రా.స. గుర్తిస్తుంది.]]
పంక్తి 8:
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగష్టులో అమెరికా అధ్యక్షుడు [[థియోడార్ రూజ్‌వెల్ట్]] మరియు బ్రిటిష్ ప్రధాని [[విన్‌స్టన్ చర్చిల్]] [[అట్లాంటిక్ మహా సముద్రం|అట్లాంటిక్ సముద్రం]]లో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకొన్న ఒప్పందాన్ని [[:en:Atlantic Charter|అట్లాంటిక్ ఛార్టర్]] అంటారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధభయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందినది.<ref>[http://www.internet-esq.com/ussaugusta/atlantic1.htm Atlantic Charter<!-- Bot generated title -->]</ref>.
 
తరువాత 1944లో [[వాషింగ్టన్]] లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐ.రా.స. ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు. 1945 ఫిబ్రవరిలో [[యాల్టా]] సమావేశంలో [[అమెరికా]], [[బ్రిటన్]], [[రష్యా]] నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945 [[ఏప్రిల్ 25]]నుండి [[జూన్ 26]] వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు పాల్గొని [[ఐక్య రాజ్య సమితి ఛార్టర్]]‌పై సంతకాలు చేశారు. 1945 క్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది.
 
== సమితి ఆశయాలు ==
పంక్తి 36:
కొన్ని పాశ్చాత్య దేశాల వలస పాలన క్రింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడడం ఈ మండలి లక్ష్యం. ఇక్కడి ప్రజలను స్వీయ ప్రతిపత్తికి లేదా స్వయంపాలనకు లేదా స్వాతంత్ర్యానికి సిద్ధం చేయడం ఈ మండలి బాధ్యత. ఇది సంవత్సరానికి రెండు సార్లు సమావేశమవుతుంది. ఇందులో మూడు రకాల సభ్యత్వాలు ఉన్నాయి
# ధర్మ కర్తలుగా కొన్ని దేశాలను పాలిస్తున్న దేశాలు
# [[భద్రతా మండలిలోమండలి]]లో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు.
# మూడేళ్ళ కాల పరిమితికి ఎన్నికైనవి.
 
పంక్తి 69:
## ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (ఐ.డి.ఎ.)
## ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐ.ఎఫ్.సి.)
## [[మల్టిలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారంటీ ఏజెన్సీ]] (ఎమ్.ఐ.జి.ఎ.)
# [[అంతర్జాతీయ ద్రవ్య నిధి]] - [[ఐ.ఎమ్.ఎఫ్.]] (IMF) - 1947 మార్చి 1 నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. దీని కేంద్ర కార్యాలయం కూడా [[వాషింగ్టన్ డి.సి.]]లో ఉంది. అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని అందించడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపొందించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం దీని ముఖ్య లక్ష్యాలు.
# మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ‘యూఎన్ ఉమెన్’ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్రకటించారు. ఈ సంస్థకు చిలీ మాజీ అధ్యక్షురాలు మిషెల్ బాచ్లెట్ నేతృత్వం వహిస్తారన్నారు. <ref>http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=11369&Categoryid=1&subcatid=31</ref>
"https://te.wikipedia.org/wiki/ఐక్యరాజ్య_సమితి" నుండి వెలికితీశారు