వికీపీడియా చర్చ:సముదాయేతర సంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
సముదాయేతర సంస్థ లంటే నాకు పూర్తి అవగాహన కలుగలేదు. నా స్పందన తెలుపుటకు మరింత విపులంగా చెప్పగలరా?.[[వాడుకరి:Palagiri|Palagiri]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 08:10, 3 జూన్ 2015 (UTC)
:[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] గారు, నాకు కూడా సముదాయేతర సంస్థలపై సరైన అవగాహన లేదు. దయచేసి వాటి గురించి తెలుపగలరు. ఉదాహరణకు CIS లాంటివి సముదాయేతర సంస్థల క్రిందికి వస్తాయా?--[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] ([[వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్|చర్చ]]) 12:52, 5 జూన్ 2015 (UTC)
:: @[[వాడుకరి:Palagiri|పాలగిరి గారూ]], [[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] గారూ. మనకు ఇప్పటిదాకా పరిచయమున్న సముదాయేతర సంస్థలలో గూగుల్ ఒకటి, సి.ఐ.ఎస్ మరోటి. ఇవే కాక భవిష్యత్తులో మరే ఇతర సంస్థ అయినా తెలుగు వికీలో పనిచెయ్యటానికి లేదా చెయ్యించటానికి వచ్చినా ఈ నియమాలు వాటిని కూడా నియంత్రించేలా రూపొందిస్తున్నాం. ఈ సంస్థలకు వివిధ ఉద్దేశ్యాలు ఉంటాయి. అవన్నీ తెవికీకి సరిపడకపోవచ్చు. ఉదాహరన్ గూగుల్ వాళ్ళు మనకు చెప్పకుండానే కొంత మంది డబ్బిచ్చి తెలుగు వికీపీడియాలోకి వ్యాసాలను అనువదింపజేశారు. పలు విమర్శల తర్వాత కానీ ఈ కార్యక్రమం చేపట్టినట్టుకూడా సముదాయాలకు చెప్పలేదు. వాళ్ళ అటోమేటిక్ అనువాదపరికరాన్ని మెరుగుపరచేందుకు ఇవి చేయించారు పనిలో పని తెవికీకూడా మేలుజరుగుతుందనుకున్నారు. కానీ ఏ విధంగా ఈ కార్యక్రమం జరిగిందో ఇక్కడ చదవండి [[వికీపీడియా:గూగుల్ అనువాద వ్యాసాలు]], అలాగే సి.ఐ.ఎస్ తో అనుభవాలు మీరు చూసే ఉంటారు. సముదాయమంటే స్వఛ్ఛందంగా ఏ లాభాపేక్షలేకుండా వికీపీడియాలో పనిచేసేవాళ్ళనమాట. సముదాయేతర సంస్థలకు సంబంధించిన వారంటే, స్వఛ్ఛంద సేవకులు కాకుండా ఇంకా ఎవరైనా వికీపీడియాలో పనిచేసేవాళ్ళు (ఉదాహరణ: వికీమీడియా ఫౌండేషన్ ఉద్యోగులు, సి.ఐ.ఎస్ ఉద్యోగులు లేదా మరేదైనా సంస్థ తరఫున ఇక్కడ పనిచేయటానికి వచ్చే ఉద్యోగులనమాట) --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 03:26, 7 జూన్ 2015 (UTC)
Return to the project page "సముదాయేతర సంస్థలు".