కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

చి 14.96.41.93 (చర్చ) చేసిన మార్పులను RahmanuddinBot యొక్క చివరి కూర్పు వరకు తిప్...
పంక్తి 24:
 
==సిరిసంపదల ఉమ్మడి కుటుంబాలు==
భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది [[ఉమ్మడి కుటుంబ వ్యవస్థ]]. నాగరికత విస్తరణకు పూర్వమే మనదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందుపరచబడి ఉంది. నాగరి ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబవ్యవస్థ మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. మనదేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరిసంపదలతో తూలతూగాయనడంలో సందేహం లేదు. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగి పోయేవి.
 
ఇంటి లోని పెద్దకు అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే వేదవాక్కు. అందరిదీ ఉమ్మడి వ్యవసాయమే. సమిష్టి సంపదనే, సమిష్టి భోజనాలే ఉండే వంటే ముచ్చటేస్తుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా మరదళ్లు, బందుమిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవ రాండ్రతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు. ఆ కుటుంబాలలో లేమి అనే పదానిే తావు ఉండేది కాదంటే అతిశయోక్తికాదు. కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకు నే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటుండేది కాదు.
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు