మల్లీశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
| imdb_id = 0259416
}}{{ఇతరవాడుకలు|[[1951]]లో విడుదలైన మల్లీశ్వరి అనే పేరుగల సినిమా}}
తెలుగు చలనచిత్ర చరిత్రలో సాటిలేని మేటి కళాఖండంగానూ, అపురూప దృశ్యకావ్యంగానూ '''మల్లీశ్వరి''' ఖ్యాతిగాంచింది. ఆ సినిమా ఎన్నిదేశాలు తిరిగిందో లెక్క లేదు. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన [[చైనా]]లోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్. నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి "మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులం. [[బి.ఎన్.రెడ్డి]] గారు దీనికి సర్వస్వం." అన్నాడు.
 
==నేపథ్యం==
శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్. రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు. ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా 'వందేమాతరం' షూటింగు కోసం [[హంపి]] వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే వున్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, [[బుచ్చిబాబు]] వ్రాసిన రాయలకరుణకృత్యం నాటిక కలిపి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] చేత "మల్లీశ్వరి" స్క్రిప్టుగా అభివృద్ధి చేశారు. సినిమా కోసం అనుమతి లేకుండా తన నాటికను వాడుకున్నారని తెలిసినా బుచ్చిబాబు కోర్టులకు ఎక్కకుండా వదిలివేశారు.<ref name="బుచ్చిబాబు గురించి గొల్లపూడి">{{cite news|last1=గొల్లపూడి|first1=మారుతీరావు|title='బుచ్చిబాబు' చిరంజీవి|url=http://www.sakshi.com/news/editorial/writer-buchi-babu-lives-forever-247555|accessdate=11 June 2015|work=సాక్షి|publisher=జగతి పబ్లికేషన్స్|date=11 జూన్ 2015}}</ref>
 
==సినిమా కథ==
[[విజయనగర సామ్రాజ్యం]] చక్రవర్తి [[శ్రీకృష్ణదేవరాయలు]] పరిపాలన నేపధ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. అప్పటి రాజవిధానం ప్రకారం రాజాంతఃపురంలో పనిచేయడానికి ఇష్టపడిన యువతులను వారింటికి పల్లకీ పంపి, వారి కుటుంబానికి ధన కనక బహుమానాలు ఇచ్చి, రాజాస్థానానికి పిలిపించేవారు. కాని ఒకసారి అంతఃపురంలో చేరిన యువతులకు బయటి మగవారితో సంబంధాలు నిషిద్ధం. ఈ నియమాన్ని అతిక్రమించినవారికి ఉరిశిక్ష వేసేవారు.
 
మల్లిక (చిన్నపుడు బేబీ మల్లిక, పెద్దయ్యాక భానుమతి), నాగరాజు (చిన్నపుడు మాస్టర్ వెంకటరమణ, పెద్దయ్యాక [[నందమూరి తారక రామారావు]]) బావా మరదళ్ళు. ఒక చిన్నపల్లెలో కలసి పెరిగారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. నాగరాజు శిల్పి. మల్లిక మంచి గాయని. ఒకసారి వారు వర్షం వచ్చినపుడు ఒక పాతగుడిలో ఉండగా అక్కడికి మారువేషంలో ఆ దేశపురాజు శ్రీకృష్ణదేవరాయలు (శ్రీవత్సవ), ఆయన ఆస్థాన కవి [[అల్లసాని పెద్దన]] ([[న్యాపతి రాఘవరావు]])వస్తారు. అతిధులకు మల్లిక, నాగరాజు ఆహారం సమకూర్చి ఆదరిస్తారు.మల్లీశ్వరి జావళి నృత్యాన్ని చూసి ఆనందిస్తాడు నాగరాజు. శ్రీకృష్ణదేవరాయలు, వారి ఆస్థాన కవి బృందం కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు. వారిని సాగనంపుతూ నాగరాజు వేళాకోళంగా ''మా మల్లికి రాణివాసం పల్లకి పంపించండి'' అని అంటాడు.
 
మల్లీశ్వరి తల్లికి డబ్బు ఆశ ఎక్కువ. అది సంపాదించడం కోసం నాగరాజు ఊరువిడిచి వెడతాడు. ఈలోగా నిజంగానే కొద్దిరోజులకు రాణివాసం పల్లకి మల్లి ఇంటికి వస్తుంది. కూతురికి పట్టిన రాణివాస యోగం చూసి మల్లి తల్లి నాగమ్మ ([[ఋష్యేంద్రమణి]]) మురిసిపోతుంది. మల్లి క్రమంగా అంతఃపురంలో మహారాణికి ఇష్టసఖి మల్లీశ్వరి అవుతుంది. కాని ప్రియురాలికి దూరమైన నాగరాజు, బావకు దూరమై మల్లి విలవిలలాడిపోతారు. అయితే రాణివాసం వలన వచ్చిన సంపద వల్ల నాగమ్మ తన కూతురిని నాగరాజునుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది.
 
తిరిగి వచ్చిన నాగరాజు హతాశుడై విరాగిగా శిల్పాలు చెక్కుతూ ఒక బృందంతో కలిసి [[విజయనగరం]] చేరతాడు. ఒకనాడు మంటప నిర్మాణం చూడడానికి వచ్చిన మల్లీశ్వరి బావను గుర్తిస్తుంది. మరునాడు వారిరువురు నదీ తీరాన కలుస్తారు. అక్కడనుంచి ఆ మరునాడు తప్పించుకుని వెడదామని అనుకుంటారు. ఎంతకూ రాని మల్లీశ్వరికై సాహసించి కోటలో ప్రవేశించిన నాగరాజును, మల్లీశ్వరిని బంధిస్తారు సైనికులు. అందుకై మరణశిక్ష పడవలసి వున్నా, వారిరువురి ప్రేమను అర్థం చేసుకున్న రాయలవారు పెద్ద మనసుతో వారిని క్షమించి వదిలేయడంతో కథ ముగుస్తుంది.
 
==పాటలు==
పంక్తి 62:
 
==విశేషాలు==
* ఈ చిత్రాన్ని [[సర్వేపల్లి రాధాకృష్ణచూసారురాధాకృష్ణ]] చూసారు. ఆయన గమనించిన విషయం- చిత్రం లో మల్లి, నాగరాజులు, మారువేషంలో ఉన్న రాయలవారిని కలిసింది పెద్దవర్షం వచ్చిన కారణం గా. ఐతె రాయలవారు వీరితో మాట్లాడి తిరిగివెళ్ళిపోయే సమయంలో గుర్రాల స్వారీ వల్ల ధూళి రేగుతుంది. ఇది ఎలా సాధ్యం?
* మల్లీశ్వరి చలనచిత్రం ద్వారా చిత్రరంగానికి ప్రముఖ కవి, భావకవితోద్యమంలో ముఖ్యులైన [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]ని పరిచయం చేశారు.
 
==మూలాలు==
*మనసున మల్లెలు జల్లిన మనోజ్ఞచిత్రం "మల్లీశ్వరి", [[నాటి 101 చిత్రాలు]], [[ఎస్.వి.రామారావు]], [[కిన్నెర పబ్లికేషన్స్]], హైదరాబాదు, 2006, పేజీలు 60-62.
*[[సి.హెచ్.రామారావు]]: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
{{మూలాలజాబితా}}
 
"https://te.wikipedia.org/wiki/మల్లీశ్వరి" నుండి వెలికితీశారు