విలయనూర్ ఎస్. రామచంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
== సైంటిఫిక్ కెరీర్ ==
రామచంద్రన్ మొదట్లో సైకోఫిజికల్ పద్ధతుల ద్వారా మానవ దృశ్యజ్ఞానంపై పరిశోధనలు చేస్తూ చూడడం అనే ప్రక్రియ వెనుక మెదడు పనిచేసే పద్ధతిని స్పష్టంగా ఆకళింపు చేసుకునే విషయాలను పరిశోధించారు. అనేక కొత్త విజువల్ ఎఫెక్టులు, భ్రమలు కనిపెట్టిన ఘనత రామచంద్రన్ కు దక్కింది. మరీముఖ్యంగా, ఈక్విలూమినెన్స్ వద్ద దృశ్యీకరణ వేగం మందగించే తీరును గ్రహించడం (ఎరుపు, ఆకుపచ్చ రంగులు సమానమైన ప్రకాశంతో ఉన్నప్పుడు), భ్రమాజనిత ఆకృతులను వినియోగించి స్టీరియోస్కోపిక్ గా పట్టుకోగలగడం వంటివాటిలో ఆయన కృషి ప్రాచుర్యం తెచ్చిపెట్టింది.1990ల్లో రామచంద్రన్ ఫాంటమ్ లింబ్స్(తెగిపోయిన శరీర భాగాలు ఉన్నట్టు, నొప్పికలుగుతున్నట్టు అనిపించే వ్యాధి), శరీర సమగ్రతను గుర్తించడంలో ఏర్పడే సమస్యలు, కాప్గ్రస్ డిల్యూజన్ వంటి నరాల వ్యాధుల(న్యూరోలాజికల్ సిండ్రోమ్స్)పై దృష్టిసారించారు. వినికిడి వల్ల దృశ్యం చూసిన అనుభూతి, వాసన వల్ల రుచి అనుభూతి వంటివి ఏర్పడే సింథేసియాను అర్థం చేసుకోవడానికి పనికివచ్చే పరిశోధనను ఆయన అందించారు.<ref name="Colapinto">{{cite news |title = Brain Games; The Marco Polo of Neuroscience|author = Colapinto, J|url = http://www.newyorker.com/reporting/2009/05/11/090511fa_fact_colapinto|newspaper = The New Yorker|date = May 11, 2009|accessdate = March 11, 2011}}</ref><ref name="2011Time100">{{cite web|url = http://www.time.com/time/specials/packages/article/0,28804,2066367_2066369_2066125,00.html|title = V.S. Ramachandran - Time 100|date = April 21, 2011|accessdate = April 21, 2011}}</ref> అద్దాలపెట్టె అనే పరికరం అందించి ఫాంటమ్ లింబ్స్ తో బాధపడే రోగులకు ఉపశమనం కలిగించారు.
 
రామచంద్రన్ రాసిన దాదాపు 180 పరిశోధన పత్రాలను వివిధ సైంటిఫిక్ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. వీటిలో 20 నేచర్ పత్రికలో ప్రచురితం కాగా మిగిలినవి సైన్స్, నేచర్ న్యూరోసైన్స్, పర్సెప్షన్ మరియు విజన్ రీసెర్చ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. [[మెడికల్ హైపోథసెస్ పత్రిక]] సంపాదకమండలిలో ఆయన ఒకరు&nbsp;<ref>[http://news.sciencemag.org/scienceinsider/2010/03/elsevier-to-editor-change-contro.html ScienceInsider, March 8, 2010]</ref> [[ఎన్సైక్లోపీడియా ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్]] కి సంపాదకులు (2002).
 
== References ==