తిరువనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
=== దివ్యదేశాలు ===
జ్యోతిర్లింగాలు 12 ఉన్నట్టుగానే విష్ణుమూర్తికి సంబంధించిన 108 దివ్యదేశాలున్నాయి. అందులో ఒకటి తిరువనంతపురంలోని ఈ అనంతపద్మనాభస్వామి దేవాలయం. అనంతపద్మనాభుడు హిందువులకు అతి పవిత్రమైన దేవుడు. ఈ దేవాలయ గోపుర నిర్మాణం 16 వ శతాబ్దంలోజరిగింది. 18 వ శతాబ్దంలో చిట్టచివరి మెరుగులు దిద్దారు. అతి పెద్ద చెరువు పక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయ్యింది. ఈ చెరువును పద్మతీర్థం (తామరల కొలను) అంటారు. ఈ దేవాలయం పేరుమీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. ‘తిరు’ ‘అనంత’ ‘పురం’ అంటే ‘అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం’ అని అర్థం. అనంత పద్మనాభుడు అనంతశయన ముద్రలో (యోగనిద్ర ఆకృతిలో అనంతుడనే సర్పం మీద శయనించి) దర్శనమిస్తాడు. ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు. అనంతుడనే సర్పం మీద శయనించి, తలను దక్షిణ దిక్కుగా పెట్టుకుని ముఖాన్ని తూర్పుముఖంగా ఉంచి శయనిస్తున్న ముద్రలో ఉంటాడు. అనంతుడు లేదా ఆదిశేషువు మీద శయనించిన భంగిమలో [[విష్ణువు]] దర్శనమిస్తాడు. నేపాల్‌లోని[[నేపాల్‌]]లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది. ఈ విగ్రహానికి అభిషేకం చేయరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. ఇక్కడ భగవంతుడు మూడు ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతికిందుగా ఉన్న శివుని ముఖం, రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన [[బ్రహ్మ]], ఉత్సవమూర్తులు, శ్రీదేవిభూదేవులు, మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి. ఎవరైనా ఆయనకు ముడుపులు చెల్లిస్తే, అది నేరుగా భగవంతునికే చెందుతుంది. విష్ణువు... శయనించి, కూర్చుని, నిలబడి... మూడు భంగిమలలో దర్శనమిస్తాడు. పద్మనాభుని విగ్రహంలో ముఖభాగం, [[వక్షస్థలం]] మినహా... [[కిరీటం]], కుండలాలు, మెడలో ధరించిన సాలగ్రామహారం, కంకణం, కమలం, కాళ్లు... అన్నీ బంగారంతో తయారైనవే. కటుశర్కర రక్షణ కారణంగా శత్రువుల కన్ను ఈయన మీద పడలేదని మహారాజు భావించేవారు.
 
ఈ దేవాలయానికి ఆరు [[నేలమాడిగ]]లు ఉన్నాయి. భక్తులు, రాజులు చెల్లించిన ముడుపులు ఇందులోనే దాచేవారంటారు. వాటికి ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ అని పేర్లు పెట్టారు. ఎ, బి మాడిగలను 130 సంవత్సరాలుగా ఏనాడూ తెరవలేదు. సి నుంచి ఎఫ్ వరకు లెక్క ప్రకారం తెరిచేవారు.
"https://te.wikipedia.org/wiki/తిరువనంతపురం" నుండి వెలికితీశారు