"గొరవయ్యలు" కూర్పుల మధ్య తేడాలు

16 bytes added ,  6 సంవత్సరాల క్రితం
చి
 
==గొరవయ్య దీక్ష==
కురుబ కులంలోని పెద్దకుమారుడో చిన్న కుమారుడో గొరవయ్య కావాలని ముందే అనుకున్నారు. గొరవయ్యను చేయడానికి గురువు లేదా గణాచారి అవసరం. ఈ గురువులు కర్నూలు జిల్లా ఆలూరు మండలం గట్టుమల్లయ్య కొండలో ఉన్నారు. గొరవయ్యగా మారాల్సిన పిల్లవాన్ని గట్టు మల్లయ్య కొండలోని మల్లేసుని గుడి దగ్గరకు తీసుకుని వెళతారు. కోనేటిలో స్నానం చేయించి కంబళి పరచి కూర్చో పెడతారు. పిల్లవాని మేనమాతో ప్రమాణం చేయిస్తారు. గురువు గవ్వలతో కట్టిన దండను ముద్రాదానం చేస్తాడు. ముద్రా దానాన్ని పిల్లవాని మెడలో కడ్తారు. శివుని మంత్రాలను దీక్ష తీసుకున్న వారి చెవిలో బండారుతో భుజాలమీద ముద్రలు వేయడాన్ని ముద్రా దానం అంటారు. తరువాత ఉన్ని దుస్తులు, [[డమరుకం]], [[బండారు]] సంచి, [[గంట]] ఇస్తారు. దీనిని గొరవ దీక్ష అంటారు. ప్రస్తుతం గొరవ దీక్ష ఇచ్చిన గణాచారికి 200 నుండి 300 రూపాయల దాకా రుసుం ఇస్తున్నారు. దీక్షను ఇచ్చే గురువును [[గణాచారి]] లేదా మద్దెల గొరవయ్య అని అంటారు. ఈ మద్దెల గొరవయ్య లేదా గణాచారి గొరవ మఠాధిపతి వద్ద శిక్షణ పొందుతాడు.
 
''మన కులవృత్తికి ద్రోహం చేయకూడదు. ఇతరులను మోసం చెయ్యొద్దు. అబద్ధం చెప్పొద్దు-'' అని పిల్ల వానితో ప్రమాణం చేయిస్తారు. ఈ దీక్షను పిల్లవానికి 16 సంవత్సరాలలోపు మాత్రమే ఇప్పిస్తారు. గొరవయ్యలను మైలర దేవుని అంశగా చూస్తారు. గొరవ దీక్షను తీసుకున్న వారు మాత్రమే బండారు ఇవ్వడానికి అర్హులు. బండారు అంటే పసుపురంగు పొడి.ఆడ వాళ్ళలో మొక్కుబడి ఉన్నావారు శివ దీక్షను తీసుకుంటారు. వీరు మైలారదేవుని భార్య మాళవికి ప్రతిరూపాలు. వీరు కన్యలుగానే ఉండి శివ సేవకు అంకితమవుతారు. గొరవ దీక్షను తీసుకున్న వాడు కోటీశ్వరుడు అయినా [[సంక్రాంతి]] పండుగనాడు మాత్రం గొరవయ్యలాగా వేషం వేసుకుని ఐదు ఊర్లు అడుక్కోవడం వీరి ఆచారం.
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1538291" నుండి వెలికితీశారు