బూర్గుల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''బూర్గుల రామకృష్ణారావు''' బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. [[హైదరాబాదు]] రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసారు. రామకృష్ణరావు [[కల్వకుర్తి]] దగ్గరలోని [[పడకల్]] గ్రామంలో 1899 మార్చి 13న జన్మించారు. వీరి స్వగ్రామం బూర్గుల; ఇంటి పేరు పుల్లం రాజు వారు. అయితే స్వగ్రామమైన బూర్గుల నామమే వీరి ప్రఖ్యాత గృహనామమైనది.
 
== రాజకీయ జీవితం ==
[[1912]]లో వివాహం జరిగింది. ఆమె [[1920]]లో మరణించడంతో, [[1924]]లో మళ్ళీపెళ్ళి చేసుకున్నాడు. [[1923]]లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొన్నాడు. [[ఆంధ్రోద్యమం]], [[గ్రంథాలయోద్యమం]], [[భూదానోద్యమం]] మొదలైన వాటిలో పాల్గొన్నాడు. [[మాడపాటి హనుమంతరావు]], [[సురవరం ప్రతాపరెడ్డి]] మొదలైన వారితో కలిసి పనిచేసాడు. [[కృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం]]కు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు.
 
హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టి తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. [[1931]]లో [[నల్గొండ]] జిల్లా [[దేవరకొండ]]లో జరిగిన [[రెండవ ఆంధ్రమహాసభకుఆంధ్రమహాసభ]]కు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, [[క్విట్ ఇండియా ఉద్యమంలోనుఉద్యమం]]లోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. [[1948]] లో [[పోలీసు చర్య]] తరువాత [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు]] అయి, వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సిసైటి ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ 222</ref>
 
[[1952]]లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాక ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో [[ముఖ్యమంత్రి]] అయ్యాడు. పూర్తి మెజారిటీ లేకున్ననూ, మంత్రివర్గంలోనూ సంపూర్ణ సహకారం లేకున్ననూ, పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు.<ref>ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 56</ref> [[1956]]లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు]] అయినపుడు, కొత్త రాష్ట్రానికి [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యాడు. బూర్గుల, [[కేరళ]] రాష్ట్రానికి [[గవర్నరు]]గా వెళ్ళాడు. [[1960]] వరకు కేరళ గవర్నరుగా పనిచేసి, తరువాత [[1962]] వరకు [[ఉత్తర ప్రదేశ్]] గవర్నరుగా పనిచేసాడు.
1948 జనవరిలో ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా హైదరాబాద్ వచ్చిన కె.యం. మున్షీని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సంవత్సరంలోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కృషి సల్పిన తీరు విశేషమైనది. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో వీరు చేపట్టిన సేవ ప్రత్యేకమైనది. ఖాదీ బోర్డు విచారణ సంఘం, [[మధ్యప్రదేశ్]] విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజం అధ్యక్షులుగా ఉన్నారు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల తెలుగు [[ఉర్దూ అకాడమీ]], భారతీయ విద్యాభవన్, ప్రశాంతి విద్వత్ పరిషత్ అధ్యక్షులుగా గొప్ప సాంస్కృతిక సేవలందించారు. క్లాసికల్ లాంగ్వేజి కమిషన్ సభ్యులుగా, [[దక్షిణ భారత హిందీ ప్రచార సభ]], [[సంస్కృత పరిషత్‌లపరిషత్‌]]ల ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించారు.
 
 
పంక్తి 50:
 
== సాహితీ వ్యాసంగం ==
బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. పారశీక వాఞ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల [[లహరీపంచకము]]ను, [[ఆది శంకరాచార్య|శంకరాచార్యుల]] [[సౌందర్యలహరి]], [[కనకధారా స్తోత్రం|కనకధారారాస్తవము]]ను [[తెలుగు]]లోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం మొదలైనవి ఆయన ఇతర రచనలు.వీరు రచించిన వ్యాసాలు 'సారస్వత వ్యాస ముక్తావళి' పేరుతో అచ్చయింది. పండిత రాజ పంచామృతం, [[కృష్ణశతకం]], [[వేంకటేశ్వర సుప్రభాతం]], నర్మద్‌గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), పారశీక వాఙ్మయ చరిత్ర మొదలైన గ్రంథాలు వెలువరించడమే కాకుండా ఎన్నో కావ్యాలకు పీఠికలు రాశారు. అనువాద రచనలు కూడా చేశారు. [[వానమామలై]], [[కాళోజీ]], [[దాశరథి]], [[నారాయణరెడ్డి]] ప్రోత్సాహంతో 'తెలంగాణ రచయితల సంఘం' ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యారు.
 
== పురస్కారాలు ==