వెంకయ్య స్వామి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==జీవిత చరిత్ర==
ఈయన స్వస్థలం ఆత్మకూరు సమీపము లోని నాగుల వెల్లటూరు. ఈయన చిన్నతనములో అందరి బాలులవలే ఉండేవారు కాదు. ఈయన చిన్నతనము నుంచే ఏకాంత ప్రియులు. ఆ వూరి లోని పిల్లలందరూ వారి మధ్య తగువులు జరిగితే మన స్వామి వారిని తగువు తీర్చమనేవారు. ఈయనను ఒక అవదూతగా, షిర్డీ సాయి తరువాతి అవతారముగానూ చెపుతారు. మరికొందరు దత్తావతారమని తలుస్తారు. వెంకయ్యస్వామి మొదట్లో పిచ్చివానిగా పిలవబడుతూ 12 సంవత్సరములు ఎక్కడ తిరిగాడో తెలియదు. తదనంతర కాలంలో గొలగమూడి చేరాడు. వేలిముద్రలు వేసిన కాగితాలు, దారాలు ఇవ్వడం చేసేవాడు. సత్యంగల నాయన అని పేరు పొందారు. తన వద్దకు వచ్చిన భక్తుల నుద్దేశించి వారికోసం తన సందేశాలను తన సేవకులచేత కాగితంపై రాయించి, వారికి అందచేసేవారు స్వహస్తాలతో. వీటిని సృష్టి చీటీలనేవారు. పలువురు వారి కష్టాలను వెంకయ్య స్వామే తీరుస్తాడనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. చిల్కూరులో బాలాజీ చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్లుగా, ఇక్కడా అవధూత దెవాలయం చుట్టూ 108 సార్లు భక్తుల ప్రదక్షిణలున్నాయి.
 
==వెంకయ్యస్వామి ఆలయం==
వెంకయ్య ఆలయంచుట్టు విశాలమైన ప్రాకారం నిర్మించారు.ప్రాకారం యొక్క ముఖద్వారం వద్దనిలుచును చూసినచో గర్భగుడి లోని వెంకయ్య స్వామి విగ్రహం స్పష్టంగా కన్పించును. గర్భగుడి పైన గోపురనిర్మాణమ్వున్నది. గర్భగుడి చుట్టు స్ధంబాలమీద స్లాబు కట్టారు.ముఖద్వారంకు ఎడమపక్కన ధుని(అగ్ని గుండం) వున్నది.స్వామి దర్శనంకు వచ్చిన భక్తులు ఈ ధునిలో ఎండుకొబ్బరికాయ, నవధాన్యాలు,ధూపద్రవ్యాలు 3లేదా 6 లేదా 9 సార్లు ధునిచుట్టు ప్రదక్షిణచేసి ఇందులో వేయుదురు.ఆ తరువాత భక్తులు క్యూలో వెళ్లి వెంకయ్య దర్సనం చేసుకుంటారు.గర్భగుడిలోని వెంకయ్యస్వామి విగ్రహంను పాలరాతితో చేసినారు.గర్భగుడికి గోడకు వెంకయ్యగారి రెండు చిత్ర పటాలను వెలాడతీసారు.తంబురా మీటుతున్నట్లుగా చిత్రపటాలున్నాయి.గర్భగుడి ద్వారంకు ఎదురుగా జ్యోతి వెలుగుతుంటుంది. జ్యోతిపక్కన వెండి పాదుక వున్నది.భక్తులు జ్యోతికి నమస్కరించి,పాదుకను తాకి,వెంకయ్యగారి దర్శనంచేసుకొని నమస్కరిస్తారు.పుజారి తీర్ధం ఇచ్చిన తరువాత,వుడికించిన శనగలను ప్రసాదం గా యిస్తారు.గుడిప్రాకారం లోపలనే కొబ్బరికాయలను కొట్తుటకు ప్రత్యేక స్థలం కలదు.ఇక్కడ కూడా వెంకయ్యగారి విగ్రహాలు న్నాయి.వెంకయ్యస్వామి గుడికి చెరువలోనే,గుడికిఎడమవైపున ఆంజనేయస్వామి ఆలయంవున్నది.వెంకయ్య గుడికి కుడి వైపున, రోడ్డుకు అవతలి వైపున వెంకయ్యస్వామి నివాసమున్న కుటీరమున్నది.కుటీరం గోడలు మట్టితో కట్టబడి,పైన గడ్దితో కప్పిన కప్పు వున్నది.కుటీరం పాడవ్వకుండ ఈ కుటీరం చుట్టు కాంక్రీట్‌స్దంభాలతో స్లాబు వేశారు.కుటీరదర్శనం చేసుకున్న భక్తులకు '''పవిత్రదారం''' యిస్తారు.వెంకయ్యగారు బ్రతికివున్నప్పుడు తనవద్దకు వచ్చిన వారికి వారి రోగనివారణ, పీడలనీవారణకై ఇలా దారం యిచ్చెవారు. కుటీరం ముందుప్రక్కన రామాలయంవున్నది.
==మొక్కులు==
స్వామి ధర్శనానికి వచ్చు భక్తులు కొందరు తమ తలనీలాలను సమర్పించుకుంటారు.తలనీలాలను తీయు క్షురశాల కలదు.రామాలయానికి కుడిపక్కన విశాలమైన బయలుప్రదేశాంలో వెంకయ్యస్వామి ఆలయనిర్వహన కమిటి ఆఫీసు వున్నది.ఆలయ నిర్వహణపనులు ఒక అడ్‌హక్‌ కమిటి ఆధ్వర్యంలో జరుగుచున్నవి. ఆఫిస్‌వెనుక భాగంలో ఉచిత అన్నదాన సత్రం వున్నది.స్వామిని దర్శించుకున్న భక్తులు తమకోరికలను విన్నవించుకున్న తరువాత ఆ రాత్రి ఆలయం సమీపంలోనే నిద్రిస్తారు.మరుసటిరోజు స్వామి దర్శనంచేసుకుని తిరుగు ముఖం పడతారు. ఆలాగే అంతకు ముందు స్వామి వారిని దర్శనం వలన కోరికలు తీరినవారుకూడ మళ్ళి వచ్చి యిక్కడ రాత్రి నిదురచేస్తారు. భక్తులు రాత్రి వసించుటకై బయలు ప్రదేశం వున్నది. భక్తులు శయనించుటకై చాపలు యిచ్చట అద్దెకు/బాడుగకు లబించును. అడ్‌హక్‌ కమిటి వారు భక్తులచందాలతో ఎ.సి./నాన్‌ఎ.సి.విశ్రాంతి గదులనిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా శనివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి, దర్శనం చేసుకుని, రాత్రి యిచ్చటనే గడిపి వెళ్ళెదరు.
 
==పత్రిక==
వెంకయ్య స్వామి తత్వచింతనను ప్రసారం చేయటానికి "భగవావ్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి సద్గురుకృప" అనే తత్వచింతనాధ్యేయ ఆధ్యాత్మిక మాసపత్రిక స్థాపించబడింది. ఇది వెంకయ్యస్వామి, [[శిరిడీ సాయిబాబా]] వంటి మహాత్ముల సాన్నిధ్యాన్ని అందిస్తుంది.
 
==సూక్తులు==
"https://te.wikipedia.org/wiki/వెంకయ్య_స్వామి" నుండి వెలికితీశారు