ఎ.ఆర్.కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
ఎ.ఆర్.కృష్ణ, [[1926]] [[నవంబర్ 13]]న [[గుంటూరు]] జిల్లా [[పెరవలి]] గ్రామములో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం [[శ్రీకాకుళం]], [[బెజవాడ]], [[చల్లపల్లి]], [[మచిలీపట్నం]] హైదరాబాదులలో జరిగింది. యల్.యం.ఇ చదువుతున్నపుడే [[హైదరాబాదు విమోచనోద్యమం]]లో పాల్గొన్నాడు. అజ్ఞాతవాసమునుండి బయటకువచ్చి [[సోషలిస్ట్ పార్టీ]] కార్యకలాపాలలో పాల్గొన్నాడు. 1948నాటికి రాజకీయ రంగం మీద [[వ్యామోహం]] విడనాడి నాటక రంగంలో ప్రవేశించాడు. 1952నాటికి పూర్తిగా నాటక రంగానికి అంకితమై వినూత్నమైన ప్రయోగాలు చేయాలన్న తపన బయలుదేరింది. జీవిక నిమిత్తం రాష్ట్ర విద్యుత్ బోర్డులో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. [[యునెస్కో]] ఆంతర్జాతీయ నాటక సంస్థకు అనుబంధసంస్థగా [[కమలాదేవి ఛటోపాధ్యాయ]] భారతీయ నాట్య సంఘాన్ని స్థాపించారు. ఆమె ప్రోద్బలంతో కృష్ణ 1952లో "[[ఇండియన్ నేషనల్ థియేటర్]]" నెలకొల్పాడు. 1953లో "దేశం కోసం" నాటక ప్రదర్శన వెల్లువ సృష్టించాడు. 1955లో ఢిలీలో జరిగిన భారతీయ నాట్యసంఘ సమావేశములో ఉపన్యాసమిచ్చి ఆ సంఘపు సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]], నాటక కళల విభాగానికి సభ్యునిగా పనిచేశాడు<ref>http://www.andhrauniversity.info/arts/theatrearts/index.html</ref>.
 
 
"https://te.wikipedia.org/wiki/ఎ.ఆర్.కృష్ణ" నుండి వెలికితీశారు