వై.వి. రావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:yvrao.jpg|frame|వై.వి.రావు]]
'''యెర్రగుడిపాటి వరదరావు''' ('''వై.వి.రావు''') (జ: [[మే 30]], [[1903]] - మ: [[ఫిబ్రవరి 14]], [[1973]]) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు.
==జీవిత విశేషాలు==
 
వై.వి.రావు [[1903]] [[మే 30]]న [[నెల్లూరు]]లో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయములో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో [[బొంబాయి]] వెళ్లాడు. బొంబాయిలో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశము పొందాడు. ఈయన కొన్ని రోజులు [[అర్దేషిర్ ఇరానీ]] యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత మద్రాసులోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన [[ఆర్.ఎస్.ప్రకాష్]] యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు [[1939]] లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన [[చింతామణి పిక్చర్స్]] ను స్థాపించాడు. [[1950]]లో శ్రీవరుణ ఫిలంస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ మరియు దక్షిణ భారత దేశములలోని ప్రముఖ చిత్రనిర్మాణ కేంద్రాలైన బొంబాయి, [[కొల్హాపూర్]], [[మద్రాసు]] మరియు [[మైసూరు]]లలో పనిచేశాడు. తొలి కన్నడ టాకీ చలనచిత్రము, ఎం.వి.సుబ్బయ్య నాయుడు మరియు ఆర్.నాగేంద్రరావు నటించిన ''[[సతీ సులోచన]]'' ఈయనే నిర్మించాడు.
 
"https://te.wikipedia.org/wiki/వై.వి._రావు" నుండి వెలికితీశారు