ధూళిపూడి ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
మొదట ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకవర్గం లో 1948లో చేరి 1953లో [[ది హిందూ]] పత్రిక లో చేరి అనుభవం సంపాదించిన తర్వాత 1959 లో [[ఆకాశవాణి]] వారి [[వాణి పత్రిక|వాణి]] పత్రిక సంపాదక బాధ్యతలు స్వీకరించారు.
 
తెలుగు సాహిత్యాన్ని రచయితలను ఆంధ్రేతరులకు పరిచయం చేయడంలో విశిష్టమైన కృషిచేశారు.<ref>http://openlibrary.org/a/OL10030A/D.-Anjaneyulu</ref> కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ వంటి పలువురి తెలుగు కవితలను ఆయన ఇంగ్లీషులోకి అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ రచనలను పరిచయం చేశారు. [[ద్వివేదుల విశాలాక్షి]] గారి 'గ్రహణం విడిచింది' నవల, అమరజీవి 'పొట్టి శ్రీరాములు జీవితచరిత్ర' వంటి కొన్ని తెలుగు పుస్తకాలను ఇంగ్లీషులోకి అనువదించారు.
 
==కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా==
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగరీత్యా ఆంజనేయులు ఢిల్లీ, హైదరాబాద్, మద్రాసులో వుంటూ సమాచారశాఖలో జర్నలిస్టుగా వృత్తిధర్మం నిర్వర్తించారు. ఉద్యోగంలో వున్న వివిధ పత్రికలకు రాస్తూ ఆంజనేయులు మంచి పేరు తెచ్చుకున్నారు. అంతకుమించి, చక్కని రచనలు ప్రచురించారు. ఆయన రాసిన పత్రికలు క్వెష్ట్, ఇండియన్ రివ్యూ, థాట్, ఇండియన్ లిటరేచర్, త్రివేణి, ఫైనాంషియల్ ఎక్స్ ప్రెస్,ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ రైటింగ్ టుడే పేర్కొనదగినవి.
 
తెలుగు పత్రికలకు ఇంగ్లీషులో రాసి పంపగా, అనువదించి వేసుకునేవారు. [[స్వతంత్ర టైమ్స్]], [[డక్కన్ హెరాల్డ్]], [[న్యూస్ టుడే]],[[ఇండియన్ బుక్ క్రానికల్]] పత్రికలు కూడా ఆంజనేయులు వ్యాసాలు ప్రచురించాయి. [[భవాన్స్ జర్నల్]] లో ఎన్నో విలువైన వ్యాసాలు ఆంజనేయులు రాశారు. వృత్తిచేస్తూనే అనేక సెమినార్లకు, చక్కని వ్యాసాలు రాయడం ఆంజనేయుల జర్నలిస్ట్ కృషిలో భాగం అయింది. దీనిఫలితంగా జీవితచరిత్ర, కళ గురించేగాక, నెహ్రూ, రాధాకృష్ణన్, అంబేద్కర్, నిరాద్ చౌదరి మొదలైనవారిపై లోతైన పరిశీలనా వ్యాసాలు రాశారు.
 
వీరి స్వంత గ్రంథాలయం మన దేశంలో అతి పెద్దదైన వ్యక్తిగత గ్రంథాలయాలలో ఒకటి.
పంక్తి 14:
తెలుగువారు గర్వించదగిన ఇంగ్లీషు జర్నలిస్టు తన 75వ ఏట [[1998]] సంవత్సరం [[డిసెంబరు 27]] తేదీన [[చెన్నై]] లో పరమపదించారు.
==తెలుగు సాహిత్యం లో కృషి==
వృత్తిరీత్యానూ,వ్యక్తి దృష్ట్యా ఆంజనేయులుగారికి ఎందరో సన్నిహితులయ్యారు. వారిలో నార్ల వెంకటేశ్వారరావు, సంజీవదేవ్,బి.ఎస్.ఆర్.కృష్ణ,కె.శ్రీనివాస అయ్యంగార్, వామనరావు, పట్టాభిరాం, ఎ.ఆర్.బాజీ, భావరాజు నరసింహారావు ప్రభృతులెందరో వున్నారు. [[నార్ల వెంకటేశ్వరరావు]] తన ఇంగ్లీషు రచనల్ని ముందుగా ఆంజనేయులు పరిశీలించిన తరువాత ప్రచురించేవారు.
 
సాహిత్య అకాడమీ ప్రచురించిన కట్టమంచి రామలింగారెడ్డి, కేంద్ర ప్రచురణ సంస్థ వెలువరించిన కందుకూరి వీరేశలింగం పేర్కొనదగిన ఆంజనేయులు రచనలు.
 
విశ్వనాథ సత్యనారాయణ, గోపీచంద్, బైరాగి, [[పాలగుమ్మి పద్మరాజు]], శ్రీశ్రీ, [[సి. నారాయణరెడ్ది]], [[దాశరధి]], [[దేవులపల్లి కృష్ణశాస్త్రికృష్ణశాస్త్]]రి మొదలైన వారిని తెలుగేతరులకు చక్కగా మదించి పరిచయం జేయడం ఆంజనేయులు కృషిళొ భాగమే. ఆయన రెండో భార్య హేమలత హిందీ విద్వాంసురాలు. ఆమె కూడా ఆంజనేయులుగారి రచనల్లో,సమాచార సేకరణలో తోడ్పడుతుండేది. ఆంజనేయులు గారికి పుస్తకాల సేకరణ మంచి అభ్యాసం. ఆయన 1999లో చనిపోయిన తరువాత శాంతిశ్రీ,ఆ గ్రంథాలయాన్ని పూనాకు తరలించారు.
 
ద్వివేదుల విశాలాక్షి రచన "గ్రహనం విడిచింది" ఇంగ్లీషులోకి అనువదించారు.
"https://te.wikipedia.org/wiki/ధూళిపూడి_ఆంజనేయులు" నుండి వెలికితీశారు