మద్దిపట్ల సూరి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
==జీవిత సంగ్రహం==
అనువాద కోవిదాగ్రణిగా ప్రసిద్ధులయిన “మద్దిపట్ల సూరి” [[తెనాలి]] సమీపంలో సంస్కృతాంధ్రవిద్యలకి ఆటపట్టయిన [[అమృతలూరు]]లో [[జులై 7]], [[1920]]నాడు జన్మించారు. అనేక సుప్రసిద్ధ నవలలు బెంగాలీ, హిందీ భాషలనుండి తెలుగులోకి స్వతంత్ర నవలలు అనిపించేంత సహజంగా అనువాదాలు చేసి అనువాద కోవిదాగ్రణి అని పేరు పొందేరు. దేశీ కవితామండలి ఆధ్వర్యంలో ప్రచురించిన శరత్ చంద్ర ఛటర్జీ నవలలు, దేవదేసు, పరిణీత అనువాదాలకు బొందలపాటి శివరామకృష్ణగారికి దోహదం చేసేరు. చివరిదశలో ఉద్యోగం లేక, ధనాభావంవల్ల కొంతమంది ప్రసిద్ధులకు కొన్ని ప్రసిద్ధ రచనలు రాసి పెట్టారు. [[మాధవపెద్ది గోఖలే]] సూరిగారిని చిత్రరంగంలో ప్రవేశపెట్టేరు 1958లో. ప్రముఖ నటుడు [[యం. ప్రభాకరరెడ్డి]], సూరి మిత్రులయినతరవాత అనేక చిత్రాలలో పని చేసేరు. ప్రభాకరరెడ్డి సూరిగారికి అనేకసందర్భాలలో ఆర్థిక సహాయం చేసేరు.
ఇటీవల “”సమరేశ్ బసు”” మహాభారత కథాకల్పన [[శాంబుడు]], “”విభూతిభూషణ్ బందోపాధ్యాయ”” చరిత్రాత్మక రచన [[పథేర్ పాంచాలి]] నవలలకు ఆయన చేసిన అనువాదాలు పునర్ముద్రిస్తున్నారు. “”విశ్వవాణి””కోసం నిమ్నవర్గాల సముద్ధరణకు కులరాహిత్యాన్ని ప్రబోధించే [[జీవనలీల]] గ్రంథాన్ని 1959లో రాసేరు. నవంబరు 19, [[1995]] తేదీన సూరి మరణించేరు.
 
==విద్య==
అన్నగారూ వ్యాకరణశిరోమణీ అయిన రామవరపు కృష్యమూర్తిశాస్త్రిగారివద్ద శ్రౌతస్మార్తాలను చెప్పుకున్నారు. హైస్కూలు చదువు నచ్చక, కలకత్తా వెళ్ళి బెంగాలీల చలిత్ భాషను, గౌడుల సంస్కృతాంధ్ర గ్రంథాలను, [[అలంకారశాస్త్రము]] అధ్యయనం చేసేరు. అక్కడే జుగాంతర్ ప్రభావంమూలాన ఆధునిక భావజాలానికి లోనై, పుట్టుబిరుదు “శాస్త్రి”ని తొలగించి డిగ్రీలు లేని పాండిత్యంతో మద్దిపట్ల సూరిగా వెనక్కి వచ్చేరు.
 
==అనువాదాలు==
"https://te.wikipedia.org/wiki/మద్దిపట్ల_సూరి" నుండి వెలికితీశారు