స్వైన్‌ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
ఉండాలి
==హెచ్‌1ఎన్‌1 ==
===హెచ్‌1ఎన్‌1===
ఏ రకం ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లోనైనా- హెచ్‌, ఎన్‌ అని రెండు రకాల యాంటిజెన్‌లు ఉంటాయి. మళ్లీ హెచ్‌ యాంటిజెన్‌లో 1 నుంచి 9 రకాలుండగా.. ఎన్‌ యాంటిజెన్‌లో 1 నుంచి 15 రకాలున్నాయి. వీటిల్లో ఏది దేనితోనైనా కలవొచ్చు. కలిసి కొత్త రూపాన్ని సంతరించుకోవచ్చు. మనం సాధారణంగా ఎక్కువగా చూసేది, జలుబుతో ఫ్లూ జ్వరాన్ని తెచ్చిపెట్టేది హెచ్‌3 ఎన్‌2 రకం వైరస్‌. హెచ్‌5ఎన్‌1 బర్డ్‌ఫ్లూ కారకం. అలాగే స్వైన్‌ఫ్లూకు హెచ్‌1 ఎన్‌1 మూలం. ఈ ఫ్లూ వైరస్‌లన్నీ కూడా గాలి ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. అందుకే ఇవి వేగంగా సమాజమంతా చుట్టబెడతాయి.
 
===గాలి సమస్య===
ఈ మధ్య అందరం ఎబోలా గురించి భయపడుతున్నాం. కానీ నిజానికి ఎబోలా రోగి శారీరక స్రావాలు మనకు తగిలితేనే అది మనకు వ్యాపిస్తుంది. కానీ స్వైన్‌ఫ్లూ అలా కాదు. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చేస్తుంది. స్వైన్‌ఫ్లూ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వైరస్‌ బయటకు వెలువడి, గాలిలో కలుస్తుంది. ఆ గాలిని పీలిస్తే చాలు, మనకూ సోకుతుంది. రోగి అక్కడి నుంచి వెళ్లిపోయినా గాలిలో వైరస్‌ ఉండొచ్చు. అలాగే ఆ దగ్గు, తుమ్మ సమయంలో వెలువడే తుంపర్లు పడిన చోట వైరస్‌ ఉంటుంది. దాన్ని మనం ముట్టుకుని.. ఆ చేతితో నోరు, ముక్కు, కళ్ల వంటివాటిలో పెట్టుకున్నా మన ఒంట్లో ప్రవేశిస్తుంది. అందుకే హెచ్‌1ఎన్‌1 వైరస్‌ను నిరోధించటం కష్టమవుతోంది.<ref>[http://eenadu.net/specialpages/sukhibhava/Sukhibavainner.aspx?qry=h5-126 ఈనాడు ఆర్టికల్]</ref>
 
==స్వైన్‌ఫ్లూ రకాలు==
"https://te.wikipedia.org/wiki/స్వైన్‌ఫ్లూ" నుండి వెలికితీశారు