సంస్థాగత సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
ఇతర నిర్వచనాలు:
 
* "సంస్కృతి అనే పదం నృశాస్త్రం నుండి వచ్చినది. దీని అర్థం పై ఏకాభిప్రాయం లేదు. అందుకే సంస్థాగత అధ్యయనాలలో దీని అనువర్తనాలు విధవిధాలుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు." - QSmircich, 1983 <br>
* "సంస్థాగత సంస్కృతి సంస్థలో సర్వత్రా ఉనికిలో ఉన్న వివిధ సందర్భాలలో మనం ఏం చేస్తాం, ఏం ఆలోచిస్తామో వాటిలో ఇమిడి ఉన్న సాంప్రదాయాల, విలువల, విధానాల, నమ్మకాల మరియు ధోరణుల సముదాయం." - McLean and Marshall, 1985 <br>
* "పని చేయటానికి మనం ఏమేం చేయాలో అవి చేయటం." - Bright and Parkin, 1997 <br>
 
సంస్థలో దాదాపు అన్నింటి గురించి ప్రస్తావించటం వలన పై నిర్వచనాలు సమస్యాత్మకంగా పరిగణించబడ్డాయి. సంస్కృతి యొక్క నిర్వచనాలు అస్పష్టంగా ఉండటం వలన సంస్థాగత సంస్కృతి సార్వత్రిక నియమం వలె అనిపిస్తుంది. వివిధ పరిశోధనా పద్ధతులు వేర్వేరుగా ఉన్ననూ జాతీయ మరియు స్థానిక సంస్కృతులు సంస్థాగత సంస్కృతిపై ప్రభావం చూపుతాయనటానికి, వీటి ప్రభావం సంస్థాగత లక్ష్యాల సాధన పై ఉంటుందనటానికి మాత్రం ఏకాభిప్రాయం కలదు. దీనిపై పరిశోధనలు జరిగి, ఇది నిరూపించబడినది.
 
వేర్వేరు ప్రదేశాలలో, సంస్థ-సంస్థకి సంస్థాగత సంస్కృతిలో తేడా ఉండటం వలన దీనికి ఒక సార్వత్రిక విధానాన్ని ఆపాదించలేము. శ్రామికులు వారి అనుభవాలని ఒకరితో ఒకరు పంచుకోవటం వలన ఇది సృష్టించబడుతుంది. దీనిలో మార్పులు అంత వేగంగా చోటుచేసుకోవు. అంతేగాక సంస్థాగత సంస్కృతి సంస్థని సాంఘికంగా, ఆర్థికంగా [[సంస్థాగత నిర్మాణం|సంస్థాగత నిర్మాణ పరంగా]] మరియు [[వ్యూహం|వ్యూహ పరంగా]] ప్రభావితం చేస్తుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/సంస్థాగత_సంస్కృతి" నుండి వెలికితీశారు