సంస్థాగత సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రాథమిక అంశాలు: వికీకోట్ మూస
పంక్తి 23:
 
వేర్వేరు ప్రదేశాలలో, సంస్థ-సంస్థకి సంస్థాగత సంస్కృతిలో తేడా ఉండటం వలన దీనికి ఒక సార్వత్రిక విధానాన్ని ఆపాదించలేము. శ్రామికులు వారి అనుభవాలని ఒకరితో ఒకరు పంచుకోవటం వలన ఇది సృష్టించబడుతుంది. దీనిలో మార్పులు అంత వేగంగా చోటుచేసుకోవు. అంతేగాక సంస్థాగత సంస్కృతి సంస్థని సాంఘికంగా, ఆర్థికంగా [[సంస్థాగత నిర్మాణం|సంస్థాగత నిర్మాణ పరంగా]] మరియు [[వ్యూహం|వ్యూహ పరంగా]] ప్రభావితం చేస్తుంది.
== వ్యాపార నిర్వహణలో సంస్థాగత సంస్కృతి ==
సంస్థాగత సంస్కృతిని అన్ని సంస్థలు గుర్తించవు. సంస్థాగత సంస్కృతికి కారకాలు మరియు ప్రభావాల యొక్క పరిశోధన [[సామాజిక శాస్త్త్రం]]తో కలిసిననూ [[నిర్వహణ]]లో కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. ప్రవర్తనా నియమావళి లో సంస్థ యొక్క నియమాలు, నిర్దేశకాలు, అంతర్గత-బాహ్య సమాచార ప్రసారాలకి సిద్ధాంతాలు మరియు ఉద్యోగి ప్రవర్తించవలసిన తీరు పేర్కొనబడి ఉంటాయి. సంస్థ కట్టుబడి ఉండే విలువలు, దినచర్యలో ఆచరించవలసిన కార్యాలు ప్రవర్తనా నియమావళికి మూలం.
 
సంస్థాగత సంస్కృతిని మార్చాలంటే [[వ్యాపార ధర్మం|వ్యాపార ధర్మాన్ని]] మరియు [[వ్యాపార దృష్టి]]ని [[మార్పు నిర్వహణ]] ద్వారా సమూలంగా మార్చవలసి ఉంటుంది. సారూప్య సంస్థాగత సంస్కృతి నెలకొనాలంటే [[వైవిధ్యత నిర్వహణ]] లో వివిధ పద్ధతులని కలగలిపి వివిధ రకాల మనుషులని, సమూహాలని అనుసంధానం చేయవలసి ఉంటుంది.
 
సంస్థాగత సంస్కృతి తో సంస్థ తన స్వంత ప్రతిబింబాన్ని ప్రదర్శిస్తుంది. [[భావ వ్యక్తీకరణ]] చేస్తుంది. అనుచరించబడుతుంది. శిక్షణ ద్వారా, మార్గదర్శక సూచనల ద్వారా నేర్పబడుతుంది. సంస్థాగత లక్ష్యాలైన అంతర్గత భావవ్యక్తీకరణ, నిర్ణయం తీసుకోవటంలో వేగం, ఫలితంగా లభార్జన దీని వలన పెరుగుతాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/సంస్థాగత_సంస్కృతి" నుండి వెలికితీశారు