చలపతిరావు తమ్మారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''చలపతిరావు ''' అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు సుప్రసిద్ద తెలుగు సినీ నటుడు. ఇతను పన్నెండు వందల సినిమాల్లో ప్రతినాయక పాత్రధారి.స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని [[బల్లిపర్రు]]. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న [[మామిళ్లపల్లి]] .
==బల్లిపర్రు గురించి చలపతిరావు ==
"బల్లిపర్రు చెరువు నీళ్లు అమృతం. పొద్దున్నే చెరువు నీళ్లు తెచ్చుకుని మట్టిబానల్లో నింపుకునేవాళ్లం. వడగట్టటం అనే మాటే లేదు. ఆ నీళ్ల ముందు ఫ్రిజ్జులు, ఖరీదైన వాటర్‌ఫిల్టర్లు ఎందుకూ పనికిరావు. మనుషులకైనా, పశువులకైనా ఆ నీళ్లనే వాడుకునేవాళ్లం. ఆ నీళ్లు తాగడం వల్లేనేమో మా ఊర్లో వాళ్లందరూ ఆరడుగుల పొడవు ఉంటారు. అంత మంచి చెరువును చేపల్ని పెంచడానికని చెప్పి కంపు కంపు చేశారు.ఊరికెళ్లినప్పుడు చెరువును చూస్తే కడుపు తరుక్కుపోతుంది.
నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి బల్లిపర్రు వెళుతుంటాము. అందుకే మా ఇంటిని అమ్మకుండా అలాగే ఉంచాం. కాని పొలాన్ని అమ్మేశాం. ప్రస్తుతం రెండెకరాలు మాత్రమే ఉంది. మా అబ్బాయి రవిబాబుతో అప్పుడప్పుడు 'ఒరే నా ప్రాణం ఉన్నంత వరకు ఆ భూమిని, ఇంటిని అమ్మకు. ఎవరైనా మనది ఏ ఊరు అనడిగితే బల్లిపర్రు అని చెబుతాం. అక్కడ ఏమీలేకపోతే ఆ ఊరిపేరును చెప్పే హక్కును కోల్పోతాం. నీ పిల్లలకు కూడా మన ఊరు అదేనని చెప్పు. ఊరితో బంధం తెంచుకోకు..' అంటుంటాను..'' (ఆంధ్రజ్యోతి 19.5.2013)
==నటించిన చిత్రాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
 
[[వర్గం:తెలుగు సినిమా ప్రతినాయకులు]]