వికీపీడియా చర్చ:సముదాయేతర సంస్థలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
:: [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] గారూ ! ఒక సంస్థను గురించి కాదు. సముదాయేతర సంస్థలతో కలిసి పనిచేస్తూ తెవికీని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే నా అభిప్రాయం. గూగుల్ విషయం నాకు తెలుసు. గూగుల్ విషయంలో సరిచేయడానికి వీలు కాని వ్యాసాలు వచ్చి చేరాయి. అలాంటివి నాకు ఆమోదయోగ్యం కాదు. సముదాయేతర సంస్థలు మనతో దీర్ఘకాలం పని చేయకపోయినా వారిని పనిచేయనివ్వడం వలన తెవికీలో జరిగే అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలి? ఇది మనతో కలిసి పనిచేలనుకుంటున్న సముదాయేతర సంస్థలకు వ్యతిరేక సందేశం ఇచ్చినట్లు కాదా ! ఇతర సంస్థలు భవిష్యత్తులో తెవికీతో కలిసి పనిచేయడానికి ఆలోచిస్తాయి కదా! తెవికీకి సముదాయేతర సంస్థలకు మద్య ఉన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన విధివిధానాలను తయారు చేసుకుంటూ ముందుకు సాగాలన్నది నా అభిప్రాయం. ఈ విషయమై అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పినట్లు నా అభిప్రాయం నేను చెప్పాను. ఇది అందరూ అంగీకరించాలని కాని దీనికి మద్దతు ఇవ్వాలన్నది కాని నా అభిమతం కాదు. --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 13:50, 3 జూలై 2015 (UTC)
: [[వాడుకరి:T.sujatha|సుజాత గారూ]] అభిప్రాయం చెప్పడంలో మీకున్న స్వేచ్ఛ నేను అర్థం చేసుకోగలను. అయితే మీ వ్యాఖ్య మీద నాకు అనిపించిందేదో రాశాను. పై సూచనల్లో ''సముదాయేతర సంస్థలను పనిచేయనివ్వకుండా అడ్డుపడుతున్నట్టు'' మీకు అనిపించిన సూచన ఏదో చెప్తే సభ్యులకు చర్చించేందుకు, సరిదిద్దుకునేందుకు వీలుచిక్కుతుంది. పోతే గూగుల్ అనువాద ప్రాజెక్టు మీకు తెలియదని కాదు, కాకుంటే మనం ఇలాంటి పాలసీ పెట్టుకోక పోవడం వల్లనే వారు ఆమోదయోగ్యం కాని, సరిజేయలేని వ్యాసాలు చేర్చేసి పోయారని గుర్తుచేస్తున్నాను అంతే. మీకు నేను రాసినది రుచించకపోతే ఏమీ అనుకోకండి. కానీ ఆరోగ్యకరమైన చర్చ కోసమే నేను ముందుకువచ్చానని గుర్తిస్తే చాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 14:09, 3 జూలై 2015 (UTC)
:: [[వాడుకరి:T.sujatha|సుజాత గారూ]], మీ స్పందనకి ధన్యవాదాలు. సముదాయేతర సంస్థలను పనిచెయ్యనివ్వకపోవటం ఈ పేజీ ఉద్దేశం కానే కాదు. కానీ గత అనుభవాల దృష్ట్యా సముదాయం స్థాయిలో వీరి చర్యలను నియంత్రించటమే దీని ఉద్దేశం. సముదాయంలో ఇతర సంస్థలు పనిచెయ్యకూడదని ఈ నిబంధనలలో ఎక్కడా లేదు. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 16:07, 3 జూలై 2015 (UTC)
Return to the project page "సముదాయేతర సంస్థలు".