హైకూ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
సాధారణ విషయాలలో అద్భుతాన్ని చూపగల ప్రక్రియ. ఏ ఆలోచన చేయకుండా ఒక దృశ్యాన్నో, సంఘటననో చూసి కవి మెరుపు వేగంతో చెప్పే ప్రక్రియ. '' మానవాత్మనీ, భూమ్యాకాశాల్ని, వెలుగునీడలను ఒకే స్నాప్ షాట్ లో పట్టే ప్రక్రియ '' అంటారు ప్రముఖ సాహితీకారులు [[వాడ్రేవు చినవీరభద్రుడు]]. కొలనులోకి రాయి విసిరితే వృత్తాలు వ్యాపించినట్లు హైకూ పాఠకునిలో ఆలోచనాతరంగాలను సృష్టిస్తుంది.
== తెలుగు హైకూల చరిత్ర ==
తెలుగులో హైకూలను పరిచయం చేసింది [[ఇస్మాయిల్ (కవి)]] గారు<ref> తెలుగు సాహిత్య చరిత్ర, రచన:డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, విశాలంధ్ర ప్రచురణలు, 2001, పుట-315</ref>. [[1991]] లో [[పెన్నా శివరామకృష్ణ]] ' రహస్యద్వారం ' పేరుతో తొలి తెలుగు హైకూ కవిత్వ సంపుటిని తీసుకవచ్చాడు. "చినుకుల చిత్రాలు" (2000), "సులోచనాలు" (2006) పేర్లతో మరో రెండు హైకూ సంకలనాలను కూడ పెన్నా శివరామకృష్ణ ప్రచురించాడు. [ప్రపంచంలోని, భారత దేశంలోని వివిధ భాషలలో వచ్చిన కొన్ని హైకూలను తెలుగులోనికి అనువదించి "దేశదేశాల హైకూ" (పాలపిట్ట బుక్స్ ప్రచురణ, 2009) అనే మరో అనువాద రచనను కూడ పెన్నా శివరామకృష్ణ వెలువరించాడు. "ప్రపంచ వ్యాప్త కవితా ప్రక్రియ హైకూ", "హైకూ - స్వరూప స్వభావాలు" అనే శీర్షికలతో పెన్నా శివరామకృష్ణ రాసిన రెండు వ్యాసాలు కూడ "దేశదేశాల హైకూ" పుస్తకంలో ప్రచురింపబడినాయి. [1994]] లో [[గాలి నాసరరెడ్డి]] జపాన్ హైకూలను తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం [[తలతోటి పృథ్విరాజ్]] ' ఇండియన్ హైకూ సొసైటీ ' ని స్థాపించి ఈ ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించి, విరివిగా రాస్తున్నారు. బి.వి.వి. ప్రసాద్, లలితానంద ప్రసాద్, వెంకటరావు, హైకూ వరలక్ష్మి మొదలగు తెలుగు కవులు హైకూలు రాస్తున్నారు.
 
== కొన్ని హైకూలు ==
"https://te.wikipedia.org/wiki/హైకూ" నుండి వెలికితీశారు