రంజాన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 18:
== ఉపవాస విధి ==
రంజాన్ మాసంలో ప్రతి దినం అయిదు పూటల నమాజు చేయడం, రంజాన్ నెలలో కఠిన ఉపవాస దీక్ష రోజా పాటించడం అనేది వయోజనులైన స్త్రీపురుషులందరికీ విధిగా నిర్ణయించబడింది. అయితే వృద్దులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో వున్నవారు ఈ విధి నుండి మినహాయింపబడ్డారు. దివ్యఖురాన్ ఉపవాస విధిని గురించి ' రంజాన్ నెలలో విధిగా నెలంతా ఉపవాసం పాటించాలి. అయితే ఎవరైనా ప్రయాణంలో వుంటే, వ్యాధిగ్రస్తులయితే వారు ఆ ఉపవాసాలను వేరే రోజులలో పూర్తిచేయాలి. దేవుడు మీకు సౌలభ్యం కలుగజేయాలని భావిస్తూ వున్నాడు కానీ, మిమ్మలను ఇబ్బందులలో పడవేయాలని అనుకోవడం లేదు అని పేర్కొంది.రంజాన్ అనగా ఉపవాస దీక్షలు మాత్రమే కాదు మనిషిలోని చెడు భావనల్ని మరియు అధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపేది. ఈ మాసంలో పేదవాడికి ఒక పూట నీవు ఆహారం పెడితే నీకు ఆ అల్లా 1000 పూటలు ప్రసాదిస్తాడు. రంజాన్ మాసమంతా ఇస్లాం మత విశ్వాసులకు పవిత్రం, పుణ్యదాయకం.
ప్రాతఃకాలం సహరీతో ఉపవాస దీక్ష రోజాకు సంకల్పించి సూర్యాస్తమయం తరవాత ఇఫ్తార్‌తో విరమిస్తారు. తదుపరి తరాబీ నమాజుల్లో పాల్గొంటారు. దైవసన్నిధిలో ఉన్న అనుభూతి పొందుతూ తాదాత్మ్యతతో శారీరక అలసట, నీరసం మరచిపోతారు. శరీర శుభ్రత పాటిస్తూ నమాజుకు పూనుకొంటారు. నమాజు చేసే సమయాన ఒక్కొక్క భంగిమ ఒక్కొక్క యోగాసనమై శారీరక దృఢత్వాన్ని, మానసిక చేతనను కలిగిస్తుంది. ఒకేసారి మనిషి బాహ్యాంతరాలు పరిశుద్ధం కావడం విశేషం.
 
== గల్ఫ్ లో రంజాన్ ==
"https://te.wikipedia.org/wiki/రంజాన్" నుండి వెలికితీశారు