"శేషాద్రి రమణ కవులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
వీరు [[గుంటూరు జిల్లా]] వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన [[దూపాటి శేషాచార్యులు]] (1890-1940) మరియు నాలుగవ వారైన [[దూపాటి వెంకట రమణాచార్యులు]] (1893-1963) కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.<ref>శేషాద్రి రమణ కవులు, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు: 837-9.</ref>
 
==జంటకవులు==
వీరు [[జయంతి రామయ్య పంతులు]] గార్ని ఉద్యోగం కోసం ఆశ్రయించగా వారు [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] తరపున శేషాచార్యులను గుంటురు జిల్లాలోను, రమణాచార్యులను నిజాం సర్కారులలోను పర్యటించి శాసనాది చారిత్రక సామగ్రిని, తాళపత్ర గ్రంథాలను సేకరించడానికి నియమించారు. వీరిద్దరు కొంతకాలం తెలుగు చరిత్ర, సాహిత్యానికి తోడ్పడే సామగ్రిని సేకరించి పరిషత్తు భండాగారం నింపారు.
 
===దూపాటి శేషాచార్యులు===
శాసన పరిష్కార బాధ్యతలను నిర్వహించిన అనంతరం వీరు బయ్యన్నగూడెం, తిప్పనపల్లె, తుళ్లూరు, వడ్డెపల్లి, ఆంధ్ర గ్రంథాలయ ముద్రణాలయం, పునాదిపాడు చివరకు బందరు హిందూ కళాశాలలోను ఉద్యోగం చేశారు.
 
===దూపాటి వేంకట రమణాచార్యులు===
వీరు గంపలగూడెం ఆస్థాన పండితులుగాను, బెజవాడ ఆంధ్ర గ్రంథాలయ ముద్రణాలయంలోను, నందిగామ బోర్డు హైస్కూలులోను పనిచేశారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1551074" నుండి వెలికితీశారు