"శేషాద్రి రమణ కవులు" కూర్పుల మధ్య తేడాలు

 
===దూపాటి వేంకట రమణాచార్యులు===
వీరు గంపలగూడెం ఆస్థాన పండితులుగాను, బెజవాడ ఆంధ్ర గ్రంథాలయ ముద్రణాలయంలోను, నందిగామ బోర్డు హైస్కూలులోను పనిచేశారు. తెలంగాణాలో స్థిరపడాలనే కాంక్షతో హనుమకొండ కళాశాలలో సంస్కృతాంధ్ర పండితులుగా 1930 లో నియమితులయ్యారు. వీరు హనుమకొండలో చారిత్రక పరిశోధన మండలిని స్థాపించి 1931లో అఖిల ఆంధ్ర చారిత్రక సమ్మేళనం జరిపి, బాలసముద్రం, మాదిరెడ్డికుంట, కాజీపేట దర్గా శాసనాలు ప్రకటించారు. 1932లో కాకతీయ వర్ధంత్యుత్సవాలలో ప్రముఖ పాత్ర పోషించారు. సురవరం ప్రతాపరెడ్డి గారి సంపాదకత్వంలో వెలువడుతున్న [[గోలకొండ కవుల సంచిక]] కు పూర్వకవి పరిచయ పీఠికను ఆయన అందించారు.
 
ఆతనిని నిర్మల్, కరీంనగరు మొదలగు ప్రాంతాలకు బదిలీ చేసినప్పుడు, వీరు ఆధ్యాత్మిక మార్గాన పయనించి [[సమర్థ రామదాసస్వామి]] పద్యకావ్యం రచించారు. 1948లో ఉద్యోగానికి పదవీ విరమణ చేసి రెండేళ్లు ఆంధ్ర విద్యాభివృద్ధిని పాఠశాలలో పనిచేశారు. పిదప కొంతకాలం పురాతత్త్వ శాఖలోను పనిచేసి వందలకొద్దీ శాసనాలు సేకరించి పరిష్కరించారు. చివరిరోజులలో ' పసర ' లో స్వగృహం ఏర్పరచుకొని వ్యవసాయం చేసి 1963లో పరమపదించారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1551110" నుండి వెలికితీశారు