ఆశారాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''ఆశారాజు''' ప్రముఖ ఉర్దూకవి. ఈయన హైదరాబాదులో పుట్టి, పెరిగి, హైదరాబాదును ప్రేమించిన కవి. ఉర్దూ కవులు ఏ నగరంలో వుంటే ఆ నగరాన్ని తమ పేరుకు చివర చేర్చుకునే వారు<ref>[http://archives.andhrabhoomi.net/askhara/hyderabadi-177 ఆంధ్రభూమి పత్రికలో]</ref>. అదొక గుర్తింపు.ఈ సంప్రదాయాన్ని స్వీకరించి ఆశారాజు ‘రాజా హైదరాబాద్’గా తన పేరుకు హైదరాబాదును చేర్చాడు. ఆశారాజు గారి చిత్తశుద్ధి, నిజాయితీ ప్రతి కవితలో తొణికిసలాడుతాయి. ఆశారాజు సరళమయిన కవి, స్వచ్ఛమైన కవి. ఒక వుర్దూ పదం లేకుండా ‘నాశ్నమైతరు’ అన్న కవిత రాశాడు<ref>[http://archives.andhrabhoomi.net/askhara/hyderabadi-177 ఆంధ్రభూమి పత్రికలో వ్యాసం]</ref>.
 
కవుల గురించి కవులే చెప్పాలి. వాళ్ళ ప్రతిభ గురించిగానీ, రూపురేఖల గురించి గానీ ఏదో సందర్భంలో కవులే చెబుతారు. గురువులాంటి మిత్రుడు, మిత్రుడిలాంటి గురువు అయిన శివారెడ్డిగారు ఆశారాజు కవిత్వం గురించి, ఆయన రచనా విధానం గురించి మంచి చిత్రణ ఇచ్చారు. “విసురుగా అగ్నిగోళాన్ని విసిరినట్టు పద్యాన్ని విసరడం అతని పద్ధతి కాదు. సౌమ్యంగా, మృదువుగా అనుభవజ్ఞుడు కథ చెబుతున్నట్టు పద్యాన్ని ఎత్తుకుంటాడు. మెల్లమెల్లగా విడమర్చుకుంటూ, దృశ్యం మీద దృశ్యం పేర్చుకుంటూ పోతాడు" అంటారు<ref>[http://kinige.com/kbook.php?id=575&name=Asharaju+Kavitavaibhavam ఆశారాజు కవితా వైభవం]</ref>..
"https://te.wikipedia.org/wiki/ఆశారాజు" నుండి వెలికితీశారు