సి.యస్.ఆర్. ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
పంక్తి 41:
 
==సినీ జీవితం==
సీఎస్సార్‌సీయస్సార్‌ చదువు ఎస్.ఎస్‌.ఎల్‌.సి. చిన్నప్పటి నుండి నాటకాల పిచ్చి ఎక్కువుగాఎక్కువగా ఉండేది. చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చినా నాటకరంగాన్నే ఆయన ఉపాధిగా ఎంచుకున్నారు. రంగస్థలంపై కృష్ణుడుగా, శివుడుగా, రామునిగా నటించడమే గాకుండా తన గాత్రమాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేవారు. రామదాసు, తుకారాం, సారంగధర వంటి ఎన్నో భిన్నమైన పాత్రలను నాటకరంగంపైనే ఆలవోకగా నటించి వాటికిజీవం పోశారు. ఈస్టిండియా ఫిల్మ్‌ కంపెనీ 1933లో నిర్మించిన [[రామదాసు]] లో ఆయనే హీరో. [[ద్రౌపదీ వస్త్రాపహరణం]] (1936)లో శ్రీకృష్ణునిగా నటించారు. సారధీ వారి [[గృహప్రవేశం (1946 సినిమా)|గృహప్రవేశం]] (1946) చిత్రం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. [[ఎల్.వి.ప్రసాద్]]‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో కామెడీ విలన్‌ పాత్రలో ఆయన నటించారు అని చెప్పే కన్నా జీవించారని చెప్పడమే సబబు. ''మైడియర్‌ తులసమ్మక్కా'' అంటూ అక్కను బుట్టలో వేసుకునే పాత్రలో ఆయన నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది. [[జీవితం]] చిత్రంలో ఆయన నోట పలికించిన ''ఆ కాలంలో నేను కాలేజి చదువుకునే రోజుల్లో'' అనే డైలాగ్‌ అప్పట్లో అందరి నోట్లో తారకమంత్రలా నానుతుండేది. మధ్యవయస్సుల నుండి వృద్ధుల వరకూ ఎవరిని కదిపినా ''ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో'' అంటుండే వారు. [[జగదేకవీరుని కథ]] లో ''హే రాజన్‌ శృంగార వీరన్‌'' అంటూ సీఎస్స్‌ఆర్‌ చెప్పిన డైలాగ్‌లు, [[రాజనాల]] తో కలిసి ఆయన పండించిన కామెడీ మరచిపోవడం సాధ్యం కాదు. విజయావారి నవ్వుల హరివిల్లు [[అప్పుచేసి పప్పుకూడు]] లో సీఎస్సార్‌ అప్పు అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్వచించారు. ''వెయ్యి రూపాయిలు కావాలంటే పది మంది దగ్గరా పది వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గిరే అప్పుతీసుకో. వడ్డీ తీరిస్తే సరి. అసలు చెల్లించినప్పటి మాట కదా'' అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు పడీపడీ నవ్విస్తాయి.
 
సీఎస్సార్‌సీయస్సార్‌ నటజీవితంలో మరో మైలు రాయి [[మాయాబజార్‌]] లోని శకుని పాత్ర. ''ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది'' వంటి డైలాగులు ఆయన నటనా ప్రతిభకు అద్ధంపడతాయి. [[కన్యాశుల్కం (సినిమా)|కన్యాశుల్కం]] లో రామప్ప పంతులుగా, [[ఇల్లరికం]] లో మేనేజర్‌గామేనేజరు గా, [[జయం మనదే]]లో మతిమరుపు రాజుగా, [[కన్యాదానం]] లో పెళ్లిల్లపెళ్లిళ్ల పేరయ్యగా, ఇలా ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. నటుడిగా ఎంతో పేరుతెచ్చుకున్న సీఎస్సార్‌సీయస్సార్‌ దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నారు. మూడు చిత్రాలకు దర్శకత్వం చేపట్టి కారణాంతరాల వల్ల వాటిని పూర్తిచేయలేకపోయారు. తన జీవితకాలమంతా కళాసేవకే అంకితమైన సీఎస్సార్‌ 1963లో కన్నుమూశారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన పాత్రలు నేటికీ సజీవంగానే నిలిచిపోయాయి.
 
==నటించిన సినిమాలు==