రేగు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
బదరీపత్రి విలీనం
పంక్తి 28:
భారతదేశంలో 90 రకాలకు పైగా రేగుపళ్లను సాగుచేస్తున్నారు. ఒక చోట మొలిచిన రేగు పళ్ల చెట్టును ఇంకో చోట నాటితే అవి బతకవు. అందుకే ముందుగా ఎక్కడ వెయ్యదలచుకుంటే అక్కడ విత్తనాలను పెట్టాలి. మనదేశంలో ఈ పండ్లు అక్టోబర్‌ ప్రారంభంలో, ఇతర ప్రాంతాలలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో వస్తాయి. మనదేశంలో సంవత్సరానికి ఒక్కో చెట్టు 5,000 నుండి 10,000 పండ్లను ఇస్తుంది. అంటు కట్టిన చెట్లైతే 30,000 వరకూ ఇస్తాయి. ప్రత్యేకంగా సాగు చేస్తే అధిక ఉత్పత్తిని సాధించవచ్చు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో వీటి సాగు చేస్తారు.
==బదరీపత్రి==
[[దస్త్రం:Ziziphus caracutta syn Z xylopyra (Ghatbor) in Vanasthalipuram, Hyderabad, AP W IMG 9256.jpg|250px|thumbnail|కుడి]]
ఈ పత్రి రేగు వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఐదవది.
ఈ పత్రి రేగు వృక్షానికి చెందినది.దీనిని ‘రేగు’పత్రి అని కూడా పిలుస్తారు. ఇది చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాధుల నివారణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒకటి లేదా రెండు ఆకులను ప్రతిరోజూ ఒకటి లేదా రెండు పూటలు తినిపిస్తే వ్యాధులు పూర్తిగా నయమవుతాయి. (ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది).వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఐదవది. ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం గుండ్రంగా ఉంటుంది. పరిమాణం చిన్నది. ఈ చెట్టు గుబురుచెట్టు గా పెరుగుతుంది.
==ఔషద గుణాలు==
రేగు పండు చూడ్డానికి చిన్నగా వుంటుంది.పచ్చిగా వున్నప్పుడు ఆకుపచ్చ రంగులో వున్నా, పక్వానికొచ్చాక రంగు మారుతుంది. పసుపు, ఆ పై ఎరుపు రంగుకు వస్తుంది. మన దేశంలో 90 రకాల రేగుపండ్లను పండిస్తున్నారు. ఇది మంచి ఔషధకారి. రేగు పండులో ఔషద గుణాలు చాల వున్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాల మంచిది. గొంతు నొప్పిని,ఆస్తమాని కండరాల నెప్పిని తగ్గించే గుణం దీనిలో వుంది. రేగు పందు గింజ చాల గట్టిగా వుంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసు కుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్ గా తాగితే నీళ్ల విరేచనాలకు బలేబాగ పని చేస్తుంది. కొన్ని ప్రాంతాలలో రేగు పండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటారు.
Line 44 ⟶ 45:
* అయితే ఎక్కువ తీసుకుంటే ప్రమాదం. పూలతో చేసిన కషాయం ఐ లోషన్‌గా ఉపయోగపడుతుంది.
* ఇది 5 నుండి 10 మీటర్ల పొడవు వరకు పెరిగే ఆకురాల్చే చెట్టు లేదా పొద. మంచి పండ్లను ఇవ్వడానికి దీనికి ఎక్కువగా నీరు అవసరమైనా అధిక ఉష్ణ్రోగ్రతను, అతి శీతలాన్ని కూడా తట్టుకుంటుంది. 7-13 డిగ్రీల సెల్సియస్‌ల నుండి 50 డిగ్రీల వరకు ఈ చెట్లు తట్టుకుంటాయి. చైనీయులు, కొరియన్లు వత్తిడి తగ్గించడానికి సాంప్రదాయక మందులలో వీటిని వాడతారు. చైనీయులు వీటిని 'హోంగ్‌ జావో లేదా హెయి జావో' అని అంటారు.
==ఆయుర్వేదంలో==
ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
==పోషకాలు==
100 గ్రాముల తాజా రేగు పండ్లలో
Line 129 ⟶ 132:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
 
{{వినాయక చవితి పత్రి}}
[[వర్గం:రామ్నేసి]]
[[వర్గం:పండ్ల చెట్లు]]
"https://te.wikipedia.org/wiki/రేగు" నుండి వెలికితీశారు