నీతి నిజాయితి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
'''నీతి నిజాయితి''' సినిమా 1972లో విడుదలైన సాంఘిక చిత్రం. ఈ సినిమా ప్రముఖ దర్శకుడు [[సింగీతం శ్రీనివాసరావు]] దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. చిత్రంలో ప్రధానపాత్రలను [[సతీష్ ఆరోరా ]], [[కాంచన ]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] తదితరులు పోషించారు.
== సినిమా నేపథ్యం ==
ప్రముఖ దర్శకుడు [[కె.వి.రెడ్డి]] వద్ద దర్శకత్వశాఖలో సింగీతం శ్రీనివాసరావు చాన్నాళ్ళు పనిచేశారు. బళ్ళారికి చెందిన పారిశ్రామికవేత్తలు హెచ్.వి.సంజీవరెడ్డి, ఎం.లక్ష్మీకాంతరెడ్డి సింగీతం శ్రీనివాసరావును కలిసి సింగీతం దర్శకత్వంలో, కె.వి.రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో ఓ సినిమా నిర్మిస్తామని అవకాశం ఇచ్చారు. అయితే ఆ విషయాన్ని కె.వి.రెడ్డికి చెప్పిచూడమని సింగీతం వారికి చెప్పారు. అప్పటికే సినిమాల్లో పరాజయాల పాలై సినిమా అవకాశాలు లేని స్థితిలో ఉన్న కె.వి.రెడ్డి, వారితో మీ రెండవ సినిమా సింగీతంతో చేద్దురుగాని, మొదటి సినిమా నన్ను దర్శకునిగా పెట్టుకుని తీయమన్నారు. పరాజయాల్లో ఉన్న దర్శకుడు కావడంతో కె.వి.రెడ్డికి దర్శకత్వం ఇవ్వలేక వారు ఆ సినిమా సంగతి వదిలేశారు.<br />
సినిమాల్లో తనకు శ్రీకృష్ణునిగా గొప్ప ఇమేజి సంపాదించిపెట్టిన కె.వి.రెడ్డి సినిమాలు లేక ఇబ్బందిపడుతూండడంతో [[నందమూరి తారక రామారావు]] ఆయనకు డబ్బుఇవ్వబోయారు. ఊరికే వచ్చే సొమ్ము తనకువద్దని, ఏదైనా సినిమాకు దర్శకత్వం చేయించుకుని ఇస్తే పుచ్చుకుంటానని కె.వి.రెడ్డి చెప్పారు. దాంతో ఆయన దర్శకునిగా రామారావు [[శ్రీకృష్ణసత్య]] సినిమా ప్రారంభించారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/నీతి_నిజాయితి" నుండి వెలికితీశారు