శ్రీకృష్ణసత్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
విజయా బ్యానర్లో అత్యంత విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన [[కె.వి.రెడ్డి]] విజయా బ్యానర్లో తీసిన [[సత్య హరిశ్చంద్ర (1965 సినిమా)|సత్య హరిశ్చంద్ర (1965)]], [[ఉమా చండీ గౌరీ శంకరుల కథ|ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968)]] సినిమాలు పరాజయం పాలయ్యాయి. దానితో విజయా వారు కె.వి.రెడ్డిని విజయా నుంచి తొలగించి, ఆయనకు వేతనాలు, సౌకర్యాలు నిలిపివేశారు. ఆయన 1968లో స్వంత బ్యానర్లో నిర్మించిన [[భాగ్యచక్రం]] సినిమా కూడా విజయం సాధించలేదు. మరే సినిమా అవకాశాలు లేకపోవడంతో గ్రీటింగ్ కార్డుల డిజైనింగ్, ఇతరుల సినిమా స్క్రిప్టుల్లో సహకారం వంటి పనులు చేస్తూ నెట్టుకొచ్చారు. సినిమాల్లో తనకు శ్రీకృష్ణునిగా గొప్ప ఇమేజి సంపాదించిపెట్టిన కె.వి.రెడ్డి సినిమాలు లేక ఇబ్బందిపడుతూండడంతో [[నందమూరి తారక రామారావు]] ఆయనకు డబ్బుఇవ్వబోయారు. ఊరికే వచ్చే సొమ్ము తనకువద్దని, ఏదైనా సినిమాకు దర్శకత్వం చేయించుకుని ఇస్తే పుచ్చుకుంటానని కె.వి.రెడ్డి చెప్పారు. దాంతో తన స్వంత బ్యానర్లో [[శ్రీకృష్ణసత్య]] సినిమా కె.వి.రెడ్డికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించి నిర్మించారు.<ref name="సింగీతం తొలినాళ్ళ సినిమాలు-గ్రేట్ ఆంధ్రా">{{cite web|last1=ఎం.బి.ఎస్.|first1=ప్రసాద్|title=రాజాజీ ఆఖరి సంతకం సింగీతంకే!|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-cine-snipplets-4-63009.html?fb_action_ids=490741911095165&fb_action_types=og.comments|website=గ్రేట్ ఆంధ్రా|accessdate=13 July 2015}}</ref>
== అభివృద్ధి ==
శ్రీకృష్ణసత్య కథాంశం రామాయణానికి, భారత కాలానికి ముడిపెడుతూ సాగుతుంది. సినిమాకు కథ, సంభాషణలు [[పింగళి నాగేంద్రరావు]] అందించారు. పాటలను పింగళి, [[సి.నారాయణ రెడ్డి|సినారె]], [[సముద్రాల రాఘవాచార్య]] రాశారు.
 
== చిత్రకథ ==
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణసత్య" నుండి వెలికితీశారు