పాలడుగు వెంకట్రావు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''పాలడుగు వెంకట్రావు''' భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయనాయకుడు. ఆ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
==సోషలిస్టు వాదిగా==
కాంగ్రెస్ లో ఉన్న కొద్దిమంది సోషలిష్టు నేతల్లో పాలడుగు వెంకట్రావు ఒకరు. స్వతహాగా పాలడుగు ధనవంతుడు, భూస్వామి అయినప్పటికీ ఆ దర్పం ప్రదర్శించకుండా సామన్య జీవితం గడిపేవాడు. ప్రజలకు సేవచేయటంలోనే అసలైన ఆనందం ఉందని ఆస్తులను పక్కనబెట్టేశాడు. సోషలిస్టు విధానాలు పాటించే పాలడుగు పిల్లలను కూడా వద్దనుకుని జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. తన ఆస్తులు కూడా ప్రజలకే చెందేలా వ్యవహరించారు. ఇలాంటి మంచి మనిషి మరణం పట్ల కాంగ్రెస్ నేతలు విచారం వ్యక్తం చేశారు. –
 
==రచయితగా==
పాలడుగు వెంకట్రావు గారు "నాటి త్యాగం-నేటి స్వార్థం- రేపటి?" అనే పేరిట ఓ పుస్తకాన్ని రాశారు. ఉక్కు మనిషి [[కాకాని వెంకటరత్నం]] అడుగుజాడల్లో నడిచిన నిజమైన శిష్యుడు పాలడుగు. అంతేకాదు,, నైతిక విలువలను, నీతి నిజాయితీలను తన జీవితంలో ఆచరించి చూపిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారాయన. పాలడుగు విప్లవకారుడు కాకపోయినా విప్లవాభిమాని, పేదలకు భూ పంపిణీ చేయాలని ఎన్నో పోరాటాలు చేసిన పోరాటయోధుడనే చెప్పొచ్చు..
==దాతగా==
పాలడుగు వెంకట్రావు ఆయన నివాస గృహాన్ని ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి "రైతు సేవా కేంద్రం"(కిసాన్ భవన్) స్థాపించుటకు [[జనవరి 20]] [[2009]] న దానం చేసారు. ఆయన ఈ కిసాన్ భవనాన్ని(వ్యవసాయ పరిశోధనా కేంద్రం) ఆయన తల్లిదండ్రులైన పాలడుగు లక్ష్మయ్య మరియు నాగరత్నమ్మ గార్ల కిసాన్ భవనంగా నామకరణం చేసారు.దీనిని పార్లమెంటు సభ్యులు సచిన్ పైలట్ ప్రారంభించారు.<ref>{{cite news|title=Paladugu donates house for Kisan Bhavan|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/paladugu-donates-house-for-kisan-bhavan/article379097.ece|agency=ద హిందూ|publisher=G.V.R. Subba Rao|date=2009-01-21}}</ref>
==మరణం==
ఆయన కేన్సర్ వ్యాధితో బాధపడుతూ [[2015]] [[జనవరి 19]] న కన్నుమూసారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/పాలడుగు_వెంకట్రావు" నుండి వెలికితీశారు