అనాస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. అందులో అనాస పండు ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. అనాస ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్ల మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువ మాదిరిగా ఉంటుంది. దీని ఆకులు పొడవుగా ముళ్ళతో సున్నితంగా ఉంటాయి. ఇది దక్షిణ అమెరికాలోని ఫిలిప్పైన్స్‌లో పుట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో పెరుగుతుంది. దీని ఉత్పత్తిలో హవాయి రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పైనాపిల్‌ ఉత్పత్తిలో 60% వాటా హవాయిదే. అమెరికన్‌ ఆదివాసులు ఈ పండు అంటే బాగా ఇష్టపడతారు. వారు దీన్ని దేవతా ఫలంగా భావిస్తారు. తాజా పండ్ల రూపంలోనే కాకుండా స్క్వాష్‌లు, జామ్‌లు, సిరప్‌లు, కార్డియల్స్ రూపంలో దీనిని మార్కెట్ చేస్తున్నారు. భారతదేశంలోకి ఇది 1548 సంవత్సరంలో ప్రవేశించింది. అప్పటి నుంచి దీని సాగు దేశీయంగా మొదలయ్యింది. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో పైనాపిల్‌ను పండిస్తారు. బహువార్షిక గుల్మము. దీని శాస్త్రీయ నామం ఎకోమోసస్‌. వృక్షశాస్త్రం ప్రకారం అనాస్‌ ఎకోమోసస్‌ అని..పిలుస్తారు. ఇది బ్రొమేలియా జాతికి చెందింది.
 
ఇది 1 మీటరు నుండి 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది కొంచెం పరిపక్వతకు వచ్చిన తరువాత పువ్వు వస్తుంది ఈ పువ్వు సుమారుగా 15 సెం.మీ ఉంటుంది. ఈ పువ్వు 12 నుండి 20 నెలల తరువాత పూర్తి పరిపక్వానికి వచ్చి, దీనిపై కనీసం 100 కనుపులు వరకూ ఏర్పడతాయి. అనాసని 1398వ సం్ప్పరంలో మెట్టమొదట గా కనుగొన్నారు. 1664 సం్ప్పరంలో యూరోపియన్లు దీనిని పైన్‌ కోన్‌గా పిలిచారు. బ్రెజిల్‌లో టూపీ అని పిలుస్తారు. ''అద్భుతమైన పండు'' అని దీని అర్ధం. దీనిని ఒక్కొక్క భాషలో ఒక్కో రకంగా పిలుస్తారు. స్పానిష్‌లో పైన్‌ కోన్‌, అమెరికాలో అనాస్‌, మన దేశంలో అయితే ఒరియాలో సాపూరీ పనాసా, తమిళంలో అనాచీ పాజ్‌ హామ్‌, బెంగాళీ, మళయాళంలో అనారోష్‌ అని పిలు స్తారు. బ్రెజిల్‌లో పెద్ద అనాస పండును అబాకాక్సీ అని పిలుస్తారు. అయితే ఇంగ్లీష్‌లో పైన్‌యాపిల్‌, తెలుగులో అనాస అనే పేర్లతోనే అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వాడబడు తున్నాయి.ముఖ్యంగా శ్రీకాకుళంజిల్లా సీతంపేట మండలంలో గిరిజనులు ఈ పంటను విస్తారంగా పండించి రాష్ట్రం నలుమూలలకు పంపిణీ చేస్తున్నారు
 
వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్‌ ఒకటి. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/అనాస" నుండి వెలికితీశారు