గోదావరి పుష్కర ఘాట్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==నిజామాబాద్‌ జిల్లా==
నిజామాబాద్‌ జిల్లా గోదావరి నది మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఈ జిల్లాలో గోదావరి నదికి 11 పుష్కర కేంద్రాలు ఉన్నాయి. ఇందులో కందకుర్తి, తాడ్‌బిలోలి, కోస్లి, బినోల, తుంగిని, ఉమ్మెడ, పోచాంపాడ్‌, సావెల్‌, తడ్‌పాకల్‌, దోంచంద, గుమ్మిర్యాల్‌ పుష్కర కేంద్రాల్లో భక్తుల సౌకర్యార్థం 18 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు.
==కరీంనగర్‌ జిల్లా==
కరీంనగర్‌ జిల్లాలో 35 పుష్కర ఘాట్లు ఉన్నాయి. మొత్తం 10 మండలాల్లో 170 కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం వాల్గొండ, మల్లాపూర్‌, సారంగపూర్‌, ధర్మపురి, వెల్గటూరు, రామగుండం, కమాన్‌పూర్‌, మంథని మండలాల్లో ఈ ఘాట్లను నిర్మించారు.