గోదావరి పుష్కర ఘాట్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 140:
పుష్కరాల సందర్భంగా కొత్తగా నిర్మించిన ఘాట్లతో కలిపి తూర్పుగోదావరి జిల్లాలో 183 స్నానాల ఘాట్లు ఉన్నాయి. అయితే కొన్ని ఘాట్లకే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఎ ప్లస్, ఎ, బి, సి కేటగిరీలుగా ఘాట్లను అధికారులు వర్గీకరించారు. రాజమండ్రి నగరంలోని కోటిలింగాలఘాట్, పుష్కర్‌ఘాట్లను ఎ ప్లస్ కేటగిరీగాను, సరస్వతిఘాట్, గౌతమఘాట్, మార్కండేయఘాట్, రామపాదాలు ఘాట్, కోటిపల్లి ఘాట్లను ఎ కేటగిరీ ఘాట్లుగాను నిర్ణయించారు. 'బి' కేటగిరి ఘాట్లుగా రాజమండ్రిలోని సుబ్బాయమ్మఘాట్, ధవళేశ్వరంలోని సున్నంబట్టిఘాట్, గాయత్రిఘాట్, చింతలఘాట్, సిఇఆర్‌పి ఘాట్, కోటిపల్లిలోని మరో ఘాట్, వాడపల్లి, ముక్తేశ్వరం, తొత్తరమూడి, బోడసకుర్రు, మురముళ్ల, అప్పనపల్లి, సోంపల్లి, రాజోలు, బొబ్బిలంక, ముగ్గళ్ల, కొత్తపేట, గేదెల్లంక ప్రాంతాల్లోని ఘాట్లను గుర్తించారు. మిగిలిన ఘాట్లన్నింటినీ సి కేటగిరీ ఘాట్లుగా పరిగణిస్తున్నారు.

కోటి లింగాల ఘాట్

దేశంలోనే అతిపెద్దదిగా నిర్మించిన కోటిలింగాల ఘాట్ ఈసారి గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఘాట్‌ను విస్తరించిన తరువాత దాని పొడవు 1128 మీటర్లు. ఇక్కడ గంటకు 70 వేల మంది పుణ్యస్నానాలు చేసేందుకు అవకాశం ఉంది. రోజుకు 8 లక్షల మంది ఎలాంటి ఇబ్బంది లేకుండా పుణ్యస్నానాలు చేసే విధంగా దీనిని తీర్చిదిద్దారు.

శివుడి సాక్షిగా జల్లు స్నానం

శివుడి సాక్షిగా జల్లు స్నానం

కోటి లింగాల ఘాట్‌కు మధ్యలో శ్రీఉమా కోటిలింగేశ్వరస్వామి ఆలయం వైపు ధ్యాన ముద్రలో శివుడి విగ్రహం ఉండే విధంగా నిర్మించిన జల్లు స్నాన ఘట్టం 2015 గోదావరి పుష్కరాలకు ప్రత్యేకాకర్షణగా నిలిచింది. వికలాంగులు, వృద్ధులు జల్లు స్నానఘట్టం కిందే పుణ్యస్నానం చేయవచ్చు.

ప్రత్యేకత కలిగిన పుష్కరఘాట్
పుష్కరఘాట్

గతంలో వెడల్పు 290 మీటర్లు. 140 మీటర్లు ఉన్న ఘాట్‌ను మరో 150 మీటర్లు విస్తరించారు. ఇక్కడ రోజుకు 3లక్షల మంది పుణ్యస్నానాలు చేసేందుకు అవకాశం ఉంది. గోదావరి రైల్వేస్టేషన్ పక్కనే ఉండటంతో పాటు నగర నడిబొడ్డున ఉన్న ఈ ఘాట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

సరస్వతి ఘాట్

దీనిని ఈసారి పుష్కరాలకు విఐపి ఘాట్‌గా గుర్తించారు. దీని పొడవు సుమారు 170 మీటర్లు. జాతీయ, రాష్టస్థ్రాయి ప్రముఖలకు ఈ ఘాట్‌లో పుణ్యస్నానాలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

గౌతమ ఘాట్

పొడవు 200 మీటర్లు. 2003 పుష్కరాల్లో ఇదే విఐపి ఘాట్. పుష్కరాల తరువాత ఈ ఘాట్ రాజమండ్రిలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది.

రామపాదాలు ఘాట్

ధవళేశ్వరంలోని రామపాదాలు ఘాట్ పొడవు 71మీటర్లు. రాజమండ్రిలోని ఘాట్ల తరువాత ఈ ఘాట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. పోలీసుల ఆంక్షలను దాటుకుని రాజమండ్రి వరకు రాలేని వారు ధవళేశ్వరంలోని రామపాదాలు రేవులోనే పుణ్యస్నానాలు చేస్తారు. ఈ ఘాట్లు మినహా మిగిలిన వాటిలో భక్తుల తాకిడి తక్కువ ఉంటుంది. ధవళేశ్వరం నుండి రాజమండ్రి వరకు ఉన్న చిన్న పెద్ద ఘాట్లు కలిపి సుమారు 16 వరకు ఉన్నాయి.