తిరుమల బ్రహ్మోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==ఉపోద్ఘాతము==
తిరుమలేశుని ఆలయంలో నిత్యకల్యాణం-పచ్చతోరణమే అయినా, బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన [[బ్రహ్మదేవుడు|బ్రహ్మదేవుడే ]]జరిపించినట్లు [[భవిష్యోత్తర పురాణం]] పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి 'బ్రహ్మోత్సవాలు' అయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారమైతే- నవాహ్నిక దీక్షతో, [[నవబ్రహ్మలు]] తొమ్మిదిరోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి 'బ్రహ్మోత్సవాలు'. అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ సంబంధంలేదనీ తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే, ఇవి చాలా పెద్దయెత్తున జరిగేవి కాబట్టి వీటిని 'బ్రహ్మోత్సవాలు' అంటారనీ ఇంకొందరి భావన. ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని 'బ్రహ్మోత్సవాలు' అంటున్నారని మరికొందరి భావన.