నెలవంక (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
'''నెలవంక''' జంధ్యాల దర్శకత్వం వహించగా, [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]], [[జె.వి.సోమయాజులు]] ముఖ్యపాత్రల్లో నటించగా 1983లో విడుదలైన తెలుగు సాంఘిక చిత్రం. సినిమా హిందూ-ముస్లిం వివాదాలు, ఐక్యత నేపథ్యంలో తీసిన సందేశాత్మక చిత్రమిది.
== చిత్ర కథ ==
శ్రీరామరాజు ([[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]]) ఛాందసుడైన క్షత్రియుడు, జమీందారు. దానధర్మాలకు ఆస్తి కరిగిపోయినా హోదా, భవంతి మాత్రం మిగిలిపోయాయి. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కుమార్తె సావిత్రి ([[రాజ్యలక్ష్మి (నటి)|రాజ్యలక్ష్మి]]) మూగ అమ్మాయి, చిన్న కుమార్తె లలిత ([[తులసి (నటి)|తులసి]]) చాలా చురుకైనది. రహీం ([[జె.వి.సోమయాజులు]]) ముస్లిం, ఖురాన్ తో పాటుగా పురాణాలు కూడా చదివిన వ్యక్తి. జమీందారు టాంగా తోలడం ఆయన వృత్తి. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. పక్కన వేరెవరూ లేకుంటే ఏరా ఒరే అంటూ పిలుచుకునేంత సాన్నిహిత్యం ఉన్నవారు. అంతటి సన్నిహితుల మధ్య చెలరేగిన గొడవలు, చివరకు ఆ గ్రామంలో హిందూ ముస్లిం మతకల్లోలాలుగా మారతాయి. చివరకు మానవత్వాన్ని మించిన మతం లేదని, వ్యతిరేక శక్తులను ఎదిరించి మతసామరస్యాన్ని తిరిగి నెలకొల్పడం ముగింపు.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/నెలవంక_(1983_సినిమా)" నుండి వెలికితీశారు