రెండుజెళ్ళ సీత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
== ఇతివృత్తం ==
గోపి, కృష్ణ, మోహన్, మూర్తి నలుగురూ ఒకే కాలేజీలో, ఒకే రూములో, ఒకే మాటగా ఉండే స్నేహితులు. వీళ్ళ ఇళ్ళ ప్రాంగణంలోనే కొత్తగా ఓ అందమైన అమ్మాయి తన కుటుంబంతో అద్దెకు దిగుతుంది. అక్కడి వరకూ ఒకే మాటగా సాగిన నలుగురి మధ్యా పోటీ మొదలవుతుంది. ఇది ముదిరి ఒకే రౌడీ చేతికి డబ్బిచ్చి నలుగురూ దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది. దాంతో రాజీపడి సీత దగ్గరకి వెళ్ళి తమలో ఎవరిని ప్రేమిస్తున్నావని అడుగుతారు. దాంతో సీత వీళ్ళకి తన గతాన్ని చెప్తుంది.<br />
మధు, సీత ప్రేమించుకుంటారు. మధు తండ్రి గండభేరుండం వీళ్ళ పెళ్ళికి రూ.2 లక్షల కట్నం అడుగుతాడు. స్కూలు మాస్టారైన సూర్యనారాయణ అన్నిటికీ ఒప్పుకుంటాడు. పెళ్ళికి అంతా సిద్ధమైనప్పుడు లేనిపోని సాక్ష్యాలు కల్పించి, సీత మీద నిందమోపి ఆమె పెళ్ళిని రద్దుచేయిస్తాడు గండభేరుండం. ఆమె గతం విని కరిగిపోయిన నలుగురు స్నేహితులూ ఆమె పెళ్ళి జరిపించాలని నిర్ణయించుకుంటారు. విజయనగరం వెళ్ళి గండభేరుండం కూతురు కాత్యాయని, కామేశ్వరరావు అనే కుర్రాడితో ప్రేమలో పడేలా చేస్తారు. మధు, సీతలను విడదీయడానికి ఫోటోలో తలలు మార్చి దొంగ సాక్ష్యాలను గండభేరుండం సృష్టించినట్టే కాత్యాయనిపైనా వీళ్ళు నలుగురూ నిందమోపుతారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రెండుజెళ్ళ_సీత" నుండి వెలికితీశారు