టి.కనకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
==నేపధ్యము==
ఈమె [[విజయవాడ]]లో [[1930]]లో అప్పారావు, సోళాపురమ్మ దంపతులకు కనకం జన్మించారు. చిన్ననాటనే తండ్రి ఉద్యోగరీత్యా విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. పురుషులే స్త్రీ పాత్రలను రంగస్థలం మీద అభినయించే ఆనాటి కాలంలో బళ్లారి రాఘవలాంటి మహానటులిచ్చిన ప్రోత్సాహంతో కొద్దిమంది నటీమణులు ముందుకొచ్చారు. అలాంటి వారిలో పురుషులతో సమానంగా పాటలూ, పద్యాలూ పాడి నిలిచిన కొద్దిమంది నటీనటులలో కనకం ఒకరు. 1948లో మద్రాసు ఆలిండియా రేడియో కనకం పాడిన జానపద గేయాలను ప్రసారం చేసి శ్రోతలను రంజింపజేసింది.
==నట జీవితం==
==పేరు తెచ్చిన చిత్రాలు==
[[ఖరగ్‌పూర్]] లో జన్మించిన కనకం చిన్పపుడు ఆకాశవాణి బాలల కార్యక్రమంలో తన గొంతు వినిపించింది. ఆ తర్వాత '''నాయకురాలు ''' అనే నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేసి తనలోని నటనను నిరూపించుకుంది.అనంతరం సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , శోభన్ బాబు, కృష్ఱ వంటి గొప్ప నటులతో నటించింది.
===పేరు తెచ్చిన చిత్రాలు===
[[కీలుగుర్రం]] (1949), [[గుణసుందరి కథ]] (1949), [[షావుకారు]] (1950)లోని పాత్రలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. షావుకారు చిత్రంలో చాకలి రామి పాత్రను కనకం ధరించి. ఆపాత్ర ఆమెకు చీర మోకాళ్ళపైకి ఎగకట్టి పయిటచెంగు జారవిడుస్తూ అమాయకంగా నోటిలో గడ్డిపరకను కొరుకుతూ, వోరకంటితో వయ్యారపు చూపులతో, రౌడీ రంగడుతో తళుకు బెళుకుల శృంగార చేష్టలకు అభినయానికి ప్రజలందరూ ముగ్ధులౌతూ ఉండేవారు. ఒక ప్రక్క చిత్రాలలో నటిస్తూనే మరోపక్క నాటకాల్లో కూడా పాత్రలు ధరించింది.
 
==నాటకాలు==
నాటకాలలో ఆమె కురుక్షేత్రం నాటకంలో కృష్ణ పాత్రను, పాండావోద్యోగంలో అర్జునుడు, కృష్ణ పాత్రలను, కృష్ణ తులాభారంలో నారదుడు, కృష్ణ పాత్రలను, రామాంజనేయ యుద్ధంలో రాముడి పాత్రను, చింతామణి నాటకంలో చింతామణి పాత్రను మరెన్నో ఇతర నాటకాలలో ఎన్నో ముఖ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె నటకరంగంలో ప్రసిద్ధులైన పీసపాటి, షణ్ముఖి ఆంజనేయరాజు, రఘురామయ్య, నల్లా రామమూర్తి, రేలంగి వెంకట్రామయ్య, మాధవపెద్ది సత్యం మొదలైన వారందరి కలిసి నటించింది. అవకాశాలు మంచిగా ఉన్న రోజుల్లో ఆమె విలాసవంతమైన జీవితం గడిపారు. తర్వాత అవకాశాలు తగ్గడంతో దుర్భరమైన జీవితం గడపవలసి వచ్చింది. మరణించే వరకు ఆమె [[విజయవాడ]]లో నివాసం ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/టి.కనకం" నుండి వెలికితీశారు