రెండుజెళ్ళ సీత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[శంకరాభరణం]] విడుదలయ్యాకా ఆ సినిమాకి రచయితగా పనిచేసిన [[జంధ్యాల|జంధ్యాలతో]] మేకప్ మేన్ గా సినీ జీవితం ప్రారంభించి, నిర్మాతగా మారిన [[జయకృష్ణ]]తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆపైన వాళ్ళిద్దరూ తరచుగా కలుసుకునేవారు, జంధ్యాల దర్శకుడు అయ్యాకా ఆయన సెట్స్ కు జయకృష్ణ తరచుగా వెళ్తూండేవారు. ఆ క్రమంలో జంధ్యాల ఆయనకి తాను తీయదలుచుకున్న రెండు జెళ్ళ సీత సినిమా కథాంశాన్ని చెప్పారు. పంపిణీదారులైన కేశవవరావు సినిమా నిర్మాణంపై ఆసక్తిని తనకు సన్నిహితులైన జయకృష్ణకు చెప్పి తోడుగా ఉండమనీ, సినిమా తీద్దామని చెప్పారు. దాంతో జంధ్యాల చెప్పిన కథాంశాన్ని వారికి చెప్పారు. నిర్మాతకి కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభమైంది.<ref name="జంధ్యామారుతం">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యా మారుతం|date=ఏప్రిల్ 2005|publisher=హాసం ప్రచురణలు|location=హైదరాబాద్|edition=I}}</ref>
 
=== నటీనటుల ఎంపిక ===
సినిమాలో నలుగురు హీరోలుగా నరేష్, ప్రదీప్, రాజేష్, శుభాకర్ నటించారు. అప్పటికే మూణ్ణాలుగు సినిమాలు చేసిన ప్రదీప్ కి ఇదే చివరి సినిమా. ఆపైన ఆయన చదువుపై శ్రద్ధపెట్టి, తర్వాత సీరియళ్ళలో నటించారు. మరో కథానాయకుడుగా అప్పటికే జంధ్యాల [[నెలవంక (1983 సినిమా)|నెలవంక]] సినిమాలో హీరోగా పనిచేసినవారు, ప్రముఖ హాస్యనటి [[శ్రీలక్ష్మి]] తమ్ముడు రాజేష్ నటించారు. [[పుష్పలత]] ([[రాము (1968 సినిమా)|రాము]] సినిమా ఫేం) కూతురు మహాలక్ష్మిని ఈ సినిమాలో కథానాయికగా ఎంపికచేశారు. అయితే కథానాయిక పాత్రకు నిర్వహించిన ఆడిషన్సుకు వచ్చి వెనుదిరిగిన వారిలో [[విజయశాంతి]], [[భానుప్రియ]], [[శోభన]] కూడా ఉన్నారు. హాస్యనటిగా సుప్రసిద్ధి పొందిన [[శ్రీలక్ష్మి]] ఈ సినిమాలో తొలిగా జంధ్యాల చిత్రానికి పనిచేశారు. అప్పటికే కొన్ని హీరోయిన్ పాత్రల్లో నటించిన శ్రీలక్ష్మికి ఈ సినిమాలో ఓ అతిథిపాత్రను ఆఫర్ చేశారు. ఈ సినిమాలోనే హీరోగా పనిచేస్తున్న ఆమె తమ్ముడు రాజేష్ హీరోయిన్ గా కనిపించిన సమయంలో ఇలాంటి అతిథిపాత్రలు వేయడం సరికాదని ఆమెని వారించారు. అయితే వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదనే విధానంలో ఈ సినిమాకి అంగీకరించారు. అయితే క్రమంగా ఆ చిన్నపాత్రని పూర్తిస్థాయి హాస్యపాత్రగా జంధ్యాల మలిచారు. ఈ సినిమాతో హాస్యనటిగా ఆమె కెరీర్ గాడిలో పడింది.<ref name="జంధ్యామారుతం" />
 
=== చిత్రీకరణ ===
సినిమా చిత్రీకరణ ప్రధానంగా [[విశాఖపట్టణం]], [[అరకులోయ]], [[విజయనగరం]] మొదలైన ప్రదేశాల్లో జరిగింది. విశాఖపట్టణంలోని [[కనకమహాలక్ష్మి ఆలయం, విశాఖపట్టణం|కనకమహాలక్ష్మి ఆలయం]]లో సినిమా షూటింగ్ అక్టోబర్ 4, 1982న ప్రారంభమైంది. సినిమా నిర్మాణానికి రూ.13 లక్షల 75 వేలు ఖర్చు కాగా 45 రోజుల పాటు నిర్మాణం జరిగింది. విశాఖపట్టణంలోని [[రామకృష్ణ బీచ్]] ఎదురుగా ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకుని అదే బిల్డింగ్ కథానాయకుల నివాసంగానూ, తర్వాత కథానాయిక సీత కుటుంబం అద్దెకు దిగే పోర్షన్ ఉన్న భవంతిగానూ చిత్రీకరించారు.
 
== సంగీతం ==
సినిమాకు [[రమేష్ నాయుడు]] సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలో ఐదుపాటలు [[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి]], "పురుషులలో పుణ్యపురుషులు వేరు" అన్న పాటను [[ఇంద్రగంటి శ్రీకాంతశర్మ]] రాశారు. "కొబ్బరి నీళ్ళ జలకాలాడి" పాట హాస్యంపరంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పాటలో "మాగాయే మహాపచ్చడి - పెరుగేస్తే మహత్తరి - అది వేస్తే అడ్డవిస్తరి - మానిన్యా మహాసుందరి" అంటూ రాసిన ఊరగాయపద్యాన్ని వేటూరి "శ్రీకాకుళే మహాక్షేత్రే, గుండేరే మహానదీ.." అంటూ సాగే శ్లోకం వరుసలో రాశానని చెప్పారు.
"https://te.wikipedia.org/wiki/రెండుజెళ్ళ_సీత" నుండి వెలికితీశారు