ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
==విజయ ప్రస్థానం==
పాటలోనే మాటలని, గళంలో అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత ఆయన ప్రత్యేకత. గళం విప్పినా... స్వరం కూర్చినా... ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా ఆయన గళానికి వుంది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు [[ఘంటసాల]] తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి ఆయన చేసే ఉచ్చారణ ఆయన పాటను పండిత పామరులకి చేరువ చేసింది. [[శంకరాభరణం]], [[సాగరసంగమం]] లాంటి తెలుగు చిత్రాలే కాకుండా [[ఏక్ దుజే కేలియే]] లాంటి [[హిందీ]] చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. [[తెలుగు]], తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకి [[జాతీయ పురస్కారాలు]] లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/breakhtml5.asp ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం]పై వ్యాసం. [[జూన్ 04]],[[2008]]న సేకరించబడినది. </ref>
 
==పురస్కారాలు==