"ముద్ద మందారం (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

విజయవంతుడైన సినీ రచయితగా తెలుగు పరిశ్రమలో పనిచేస్తున్న [[జంధ్యాల]] అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కొన్ని అంతర్జాతీయ స్థాయి చిత్రాలను చూసి వాటి వాస్తవికతకు ముచ్చటపడ్డారు. అలాంటి వాస్తవికమైన సినిమా తీయాలన్న ఆలోచనతో దర్శకుడయ్యారు. ఆ క్రమంలోనే ఈ సినిమాకు ప్రారంభమైంది. టీనేజ్ ప్రేమకథతో నిర్మించబోయే చిత్రానికి "ముద్దమందారం", "సన్నజాజి" అనే పేర్లలోంచి ముద్దమందారమనే పేరును ఎంచుకున్నారు.<ref name="జంధ్యామారుతం">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యా మారుతం|date=ఏప్రిల్ 2005|publisher=హాసం ప్రచురణలు|location=హైదరాబాద్|edition=I}}</ref>
=== తారాగణం ఎంపిక ===
{| class="infobox" style="font-size:100%;"
|-
! నటుడు
! class="unsortable" |<!--non-semantic mimicry of film credit look -->
! పాత్ర
|-
| [[విజయ నరేష్|నరేష్]]
| ...
| గోపి
|-
| రాజేష్
| ...
| మోహన్
|-
| ప్రదీప్
| ...
| కృష్ణ
|-
| శుభాకర్
| ...
| మూర్తి
|-
| మహాలక్ష్మి
| ...
| సీత
|-
| [[అల్లు రామలింగయ్య]]
| ...
| గండభేరుండం
|-
| కమలాకర్
| ...
| మధు
|-
| [[శుభలేఖ సుధాకర్]]
| ...
| కామేశ్వరరావు
|-
| [[సాక్షి రంగారావు]]
| ...
| సూర్యనారాయణ
|-
| [[సుత్తివేలు]]
| ...
| సుబ్బారావు
|-
| శ్రీలక్ష్మి
| ...
| అనసూయ
|-
| [[సుత్తి వీరభద్రరావు]]
| ...
| రిటైర్డ్ మేజర్ మంగపతి
|-
| పొట్టి ప్రసాద్
| ...
| ఎ.ఎ.రావు
|-
| దేవి
| ...
| కాత్యాయని
|-
| పుష్పలత
| ...
| సీత తల్లి
|-
| [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]
| ...
| అప్పలకొండ
|-
| కృష్ణచైతన్య
| ...
| రసశ్రీ
|-
| మాస్టర్ చక్రవర్తి
| ...
| డుంబు
|-
| టెలిఫోన్ సత్యనారాయణ
| ...
| సేఠ్ జీ
|-
|}
 
జంధ్యాలకు విన్నకోట రామన్నపంతులు గురుతుల్యులు. చిన్నతనంలో వాళ్లింట్లోనే ఎక్కువగా పెరిగారు, ఆయన కొడుకు విన్నకోట విజయరామ్ మంచి స్నేహితులు. విజయరామ్ మేనల్లుడు, రామన్నపంతులు మనవడు అయిన ప్రదీప్ అప్పుడు డిగ్రీ చదువుతుండేవాడు. అతను నటించిన ఓ నాటికను చూసిన జంధ్యాల అతనితో "నిన్ను సినిమా హీరోని చేస్తాను రా" అని ఈ సినిమాలోకి తీసుకున్నారు. మద్రాసులో జంధ్యాల తన ఇంట్లోనే ఉంచుకుని ప్రదీప్ కి డ్యాన్సులు, ఫైట్లు, గుర్రపుస్వారీలు, కార్ డ్రైవింగ్ లాంటివన్నీ నేర్పించారు. కొత్త తెలుగు సినిమాలు చూసి, వాటిలో హీరోలు ఎలా చేస్తున్నారో చూడమని సూచించారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1559751" నుండి వెలికితీశారు