"రెండుజెళ్ళ సీత" కూర్పుల మధ్య తేడాలు

|}
సినిమాలో నలుగురు హీరోలుగా నరేష్, ప్రదీప్, రాజేష్, శుభాకర్ నటించారు. అప్పటికే మూణ్ణాలుగు సినిమాలు చేసిన ప్రదీప్ కి ఇదే చివరి సినిమా. ఆపైన ఆయన చదువుపై శ్రద్ధపెట్టి, తర్వాత సీరియళ్ళలో నటించారు. మరో కథానాయకుడుగా అప్పటికే జంధ్యాల [[నెలవంక (1983 సినిమా)|నెలవంక]] సినిమాలో హీరోగా పనిచేసినవారు, ప్రముఖ హాస్యనటి [[శ్రీలక్ష్మి]] తమ్ముడు రాజేష్ నటించారు. [[పుష్పలత]] ([[రాము (1968 సినిమా)|రాము]] సినిమా ఫేం) కూతురు మహాలక్ష్మిని ఈ సినిమాలో కథానాయికగా ఎంపికచేశారు. అయితే కథానాయిక పాత్రకు నిర్వహించిన ఆడిషన్సుకు వచ్చి వెనుదిరిగిన వారిలో [[విజయశాంతి]], [[భానుప్రియ]], [[శోభన]] కూడా ఉన్నారు. హాస్యనటిగా సుప్రసిద్ధి పొందిన [[శ్రీలక్ష్మి]] ఈ సినిమాలో తొలిగా జంధ్యాల చిత్రానికి పనిచేశారు. అప్పటికే కొన్ని హీరోయిన్ పాత్రల్లో నటించిన శ్రీలక్ష్మికి ఈ సినిమాలో ఓ అతిథిపాత్రను ఆఫర్ చేశారు. ఈ సినిమాలోనే హీరోగా పనిచేస్తున్న ఆమె తమ్ముడు రాజేష్ హీరోయిన్ గా కనిపించిన సమయంలో ఇలాంటి అతిథిపాత్రలు వేయడం సరికాదని ఆమెని వారించారు. అయితే వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదనే విధానంలో ఈ సినిమాకి అంగీకరించారు. అయితే క్రమంగా ఆ చిన్నపాత్రని పూర్తిస్థాయి హాస్యపాత్రగా జంధ్యాల మలిచారు. ఈ సినిమాతో హాస్యనటిగా ఆమె కెరీర్ గాడిలో పడింది.<br />
సుత్తి వీరభద్రరావు రిటైర్డ్ మేజర్ అయిన మంగపతి పాత్ర చేశారు. మంగపతి జారుడు బండ మీద నుంచి జారడం, సీ-సా ఆడడం వంటివి చేసి నవ్విస్తాడు. నేను రెండుసార్లు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాను తెలుసా అంటూ పాత్ర ముగించేప్పుడు కూడా నవ్విస్తారు. [[నాలుగు స్తంభాలాట (సినిమా)|నాలుగు స్తంభాలాట]] సినిమాలో చేసిన సుత్తి పాత్రను గుర్తుకుతెస్తూ పాత్ర ప్రారంభించడమే సుత్తి కొడుతూ కనిపిస్తుంది. [[అల్లు రామలింగయ్య]] గండభేరుండం అనే పాత్రను పోషించారు. ఆయనకు ఉత్తర భారతదేశమన్నా, హిందీ భాష అన్నా చాలా ఇష్టం. వచ్చీరాని హిందీ మాట్లాడి హాస్యం సృష్టిస్తుంది ఆ పాత్ర.<ref name="జంధ్యామారుతం" />
 
=== చిత్రీకరణ ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1559755" నుండి వెలికితీశారు