సుమంగళి (1940 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
== విడుదల ==
సుమంగళి సినిమా నిర్మాణం సమయంలోనే బి.ఎన్.రెడ్డి స్నేహితులు ఒకరు సినిమాని చెన్నై ప్రాంతంలో పంపిణీ చేసేందుకు ముందుకువచ్చారు. బి.ఎన్.రెడ్డికి ఆయన చెప్పిన రేటు నచ్చకపోవడం, బి.ఎన్.రెడ్డి అడిగినంత ఆయన ఇవ్వకపోవడంతో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. మద్రాసు నగరపాలక సంస్థ నుంచి ఆ పంపిణీదారుడు అప్పటికి మద్రాసు మొత్తం మీద స్తంభాలకు వెదురు దట్టీలు కట్టి అడ్వర్టైజ్మెంట్లు అంటించి ప్రచారం చేసే హక్కు పొందారు. తనకు సినిమా పంపిణీ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన పంపిణీదారు మద్రాసులో పోస్టర్ల ద్వారా ప్రచారం చేయనీయలేదు. అయితే సినిమా ప్రచారం లేకుండా విడుదల చేయడం కుదరదు కనుక బి.ఎన్.రెడ్డి తమ్ముడు, తర్వాతి కాలంలో నిర్మాతగా ఎదిగిన [[బి.నాగిరెడ్డి]] ఒక పథకం వేశారు. దాని ప్రకారం కార్పొరేషన్ ముద్రలు ఉన్న పోస్టర్లను వెదురుదట్టికి కుట్టిన గోనెసంచులకు అతికించి, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలకు కట్టారు. ఈ చిత్రం విజయం సాధించలేకపోయినా బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి తన తరహాలో మార్పు చేసుకోకుండా కళాత్మక చిత్రాల రూపకల్పనకే ప్రాధాన్యత ఇచ్చారు. విజయం సాధించకున్నా సినిమాకు విమర్శకుల నుంచి మాత్రం ప్రశంసలు దక్కాయి. 'పాల్‌ముని ఆఫ్‌ ఇండియా' అంటూ నాగయ్యని ఈ చిత్రం చూసి ఫిలిం ఇండియా పత్రికలో బాబురావు పటేల్‌ నాగయ్య గురించి రాసారు.<ref name="Sumangali @ Andhraprabha">[http://www.prabhanews.com/cinespecial/article-139714 14 తెలుగు చిత్రాలు 1940 లో - ఆంధ్రప్రభ ఆగష్టు 26, 2010]</ref>
 
==సాంకేతికవర్గం==
"https://te.wikipedia.org/wiki/సుమంగళి_(1940_సినిమా)" నుండి వెలికితీశారు