సుమంగళి (1940 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
=== ప్రచారం ===
సుమంగళి సినిమా నిర్మాణం సమయంలోనే బి.ఎన్.రెడ్డి స్నేహితులు ఒకరు సినిమాని చెన్నై ప్రాంతంలో పంపిణీ చేసేందుకు ముందుకువచ్చారు. బి.ఎన్.రెడ్డికి ఆయన చెప్పిన రేటు నచ్చకపోవడం, బి.ఎన్.రెడ్డి అడిగినంత ఆయన ఇవ్వకపోవడంతో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. మద్రాసు నగరపాలక సంస్థ నుంచి ఆ పంపిణీదారుడు అప్పటికి మద్రాసు మొత్తం మీద స్తంభాలకు వెదురు దట్టీలు కట్టి అడ్వర్టైజ్మెంట్లు అంటించి ప్రచారం చేసే హక్కు పొందారు. తనకు సినిమా పంపిణీ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన పంపిణీదారు మద్రాసులో పోస్టర్ల ద్వారా ప్రచారం చేయనీయలేదు. అయితే సినిమా ప్రచారం లేకుండా విడుదల చేయడం కుదరదు కనుక బి.ఎన్.రెడ్డి తమ్ముడు, తర్వాతి కాలంలో నిర్మాతగా ఎదిగిన [[బి.నాగిరెడ్డి]] ఒక పథకం వేశారు. దాని ప్రకారం కార్పొరేషన్ ముద్రలు ఉన్న పోస్టర్లను వెదురుదట్టికి కుట్టిన గోనెసంచులకు అతికించి, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలకు కట్టారు. ఈ వినూత్న ప్రయోగం గురించి అంతా మాట్లాడుకున్నారు. రోడ్లమీద నడిచే జనం నెత్తిన ఈ బ్యానర్లు తెగిపడతాయంటూ కొందరు కోర్టులో కేసు వేశారు. అవన్నీ తొలగించమని తీర్పు వచ్చింది. అయితే రాత్రికి రాత్రి వచ్చిన ఈ తీర్పు అమలై మొత్తం తొలగించేసరికే వారం రోజులు పట్టింది. ఈలోగా చిత్రానికి మంచి ప్రచారం దొరికింది.<br />
మద్రాసులోని పారగన్ థియేటర్లో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతూండడంతో ప్రజలు సినిమాకి రావడానికి భయపడేవారు. కొందరు రౌడీలు ఈ పనిచేస్తూండడంతో వారిని అరికట్టేందుకు అప్పటికి ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్న నాగిరెడ్డి, తన ముఠాకార్మికులను వెంటబెట్టుకుని వచ్చారు. మొదట నాగిరెడ్డి ఓ బ్లాక్ మార్కెట్ రౌడీతో తలపడడం, వెనువెంటనే పథకం ప్రకారం కార్మికులంతా వచ్చి రౌడీల పనిపట్టడం జరిగింది. ఆ తర్వాత వారి నాయకుణ్ణి పిలిచి, ఈ పనిచేసేందుకు వారికి ఎంత వస్తుందో కనుకున్నారు. రోజుకు అర్థరూపాయి వస్తుందని తెలసుకుని, రోజుకు రూపాయి చొప్పున ఊర్లో సినిమా కరపత్రాలు పంచేపనికి పెట్టారు. హోటళ్ళ బయట కరపత్రాలు పంచేవారు, బస్టాపులు, ట్రాముల వద్ద వాహనాల్లోకి కరపత్రాలు వెదజల్లేవారు. చివరకు సినిమాకి చాలా మంచి ప్రచారం లభించడంతో, జెమిని స్టూడియో అధినేత ఎస్.ఎస్.వాసన్ చిత్రం ప్రచారం గురించి నాగిరెడ్డిని అభినందించారు.<ref name="జ్ఙాపకాల పందిరి">{{cite book|last1=బి.|first1=నాగిరెడ్డి|title=జ్ఞాపకాల పందిరి|date=మార్చి 2009|publisher=బి.విశ్వనాథ రెడ్డి|location=చెన్నై|language=తెలుగు}}</ref>
 
=== ప్రజాదరణ, సమీక్షలు ===
"https://te.wikipedia.org/wiki/సుమంగళి_(1940_సినిమా)" నుండి వెలికితీశారు