చంద్రహారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి (గౌరి)నే పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు వున్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా వుండగా రాకుమారుని పాట విని యక్షకన్య చంచల వచ్చి తనను ప్రేమించమని కోరి, భంగపడి అతని మెడలోని చంద్రహారాన్ని తీసుకుని పోతుంది. ఫలితంగా అతను మరణిస్తాడు. మరో యక్షిణి సహాయంతో మళ్ళీ జీవిస్తాడు. ఈ జీవన్మరణ సమస్యతో వున్న చందనరాజు గౌరిని చూసి వివాహం చేసుకుంటాడు. చివరకు ఆమె పాతివ్రత్య మహిమలే చంచలకు ఓటమి, యువరాజుకు ప్రాణగండం తప్పుతుంది.
== విడుదల, స్పందన ==
విజయా వారు [[పాతాళ భైరవి (సినిమా)|పాతాళ భైరవి]] తర్వాత ఆ స్థాయిలో నిలిచిపోవాలనుకుని ఈ సినిమా తీయడంతో, అందుకు తగట్టు మంచి ప్రచారం చేయించారు. ఆంధ్ర ప్రాంతంలోని అన్ని కేంద్రాల్లోనూ సినిమాను విడుదల చేశారు. నెల్లూరులో నిర్మాతల్లో ఒకరైన [[బి.నాగిరెడ్డి]] మామయ్య నడుపుతున్న శేష్ మహల్ థియేటర్లో విడుదలైంది. అదే థియేటర్లో నిర్మాతలు నాగిరెడ్డి, [[చక్రపాణి]] సినిమా తొలిరోజు చూశారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/చంద్రహారం" నుండి వెలికితీశారు