చంద్రహారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి (గౌరి)నే పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు వున్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా వుండగా రాకుమారుని పాట విని యక్షకన్య చంచల వచ్చి తనను ప్రేమించమని కోరి, భంగపడి అతని మెడలోని చంద్రహారాన్ని తీసుకుని పోతుంది. ఫలితంగా అతను మరణిస్తాడు. మరో యక్షిణి సహాయంతో మళ్ళీ జీవిస్తాడు. ఈ జీవన్మరణ సమస్యతో వున్న చందనరాజు గౌరిని చూసి వివాహం చేసుకుంటాడు. చివరకు ఆమె పాతివ్రత్య మహిమలే చంచలకు ఓటమి, యువరాజుకు ప్రాణగండం తప్పుతుంది.
== విడుదల, స్పందన ==
సాధారణంగా విజయా వారు తీసిన సినిమాలను విడుదల వరకూ దాచిపెట్టరు, సినమా రషెస్ ఎప్పటికప్పుడు ఇతర సినిమా జనానికి, డిస్ట్రిబ్యూటర్లకు, విలేకరులకు చూపుతూంటారు. అలా సినిమాను చూసిన సినీ జనమంతా సినిమా సూపర్ హిట్ అవుతుందన్నారు. విజయా వారు [[పాతాళ భైరవి (సినిమా)|పాతాళ భైరవి]] తర్వాత ఆ స్థాయిలో నిలిచిపోవాలనుకుని ఈ సినిమా తీయడంతో, అందుకు తగట్టు మంచి ప్రచారం చేయించారు. ఆంధ్ర ప్రాంతంలోని అన్ని కేంద్రాల్లోనూ సినిమాను విడుదల చేశారు. సినిమాలో కథ మెల్లిగా సాగడం, హీరో ఎంతకూ నిద్రలేవకపోవడం వంటి అంశాల వల్ల సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదే విషయాన్ని నెల్లూరు శేష్ మహల్ థియేటర్లో తొలిరోజు సినిమా చూస్తున్న నిర్మాతలను ఇంటర్వెల్ సమయంలో కొందరు యువకులు అడిగేశారు. అలా సినిమా పరాజయం పాలైంది.<ref name="జ్ఙాపకాల పందిరి">{{cite book|last1=బి.|first1=నాగిరెడ్డి|title=జ్ఞాపకాల పందిరి|date=మార్చి 2009|publisher=బి.విశ్వనాథ రెడ్డి|location=చెన్నై|language=తెలుగు}}</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/చంద్రహారం" నుండి వెలికితీశారు