అష్టా చమ్మా (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
==కథ==
సినీనటుడు [[మహేష్ బాబు]] అభిమాని అయిన హైదరాబాద్ అమ్మాయి లావణ్య ([[కలర్స్ స్వాతి]]) అభిమానం హద్దుమీరి ఆయన్నే పెళ్లిచేసుకోవాలనుకుంటుంది. హఠాత్తుగా మహేష్ బాబు [[నమ్రతా శిరోద్కర్]] ని పెళ్ళిచేసేసుకున్నాడని తెలిసి చాలా నిరుత్సాహపడిపోతుంది. అయితే సినీనటుడు మహేష్ ని పెళ్ళిచేసుకోలేకపోయినా కనీసం మహేష్ అన్న పేరున్న వ్యక్తినైనా పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. రోజంతా మహేష్ బాబు సినిమా పాటలు పెట్టుకుని పిచ్చెక్కిస్తుండడంతో పక్కింటి కుర్రాడు ఆనంద్ ([[అవసరాల శ్రీనివాస్]]) ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. మహేష్ అనే పేరుండి, లావణ్యకు తగిన వరుడు కాగల వ్యక్తి కోసం తిరిగీ తిరిగీ చివరికి రియల్ ఎస్టేట్ బిజినెస్ తక్కువగానూ, జీవితన్నా ఎంజాయ్ చేయడం ఎక్కువగానూ చేసే మహేష్ ([[నాని]])ని పట్టుకుంటాడు. మహేష్ ని లావణ్యకి పరిచయం చేసిన కొద్దిరోజులకే వారిద్దరూ ప్రేమించుకుంటారు.<br />
లావణ్య మొదట తన పేరును చూసే ఇష్టపడిందన్న విషయం మహేష్ కి చెప్పేస్తుంది. మహేష్ వెంటనే ఆనంద్ ని కలిసి తన గతం చెప్తాడు. నిజానికి మహేష్ అసలు పేరు రాంబాబు. కోనసీమలోని లక్కవరం గ్రామంలో ఊరిపెద్ద కొడుకు. తల్లిదండ్రులు చనిపోయిన నాటి నుంచి చెల్లెలు వరలక్ష్మిని పాదాలు కందకుండా పెంచుతూంటాడు. ఊళ్ళోవాళ్ళకి ఏ తగవైనా పెద్దమనిషిగా రాంబాబే తీర్పుచెప్పాలి. ఇలా వయసుకు మించిన బరువుబాధ్యతలు, మంచితనం భరిస్తూన్న రాంబాబుకు వీటి నుంచి విముక్తి కోసం మైకేల్ జాక్సన్ పాటల క్యాసెట్ పెట్టుకుని వింటూంటాడు. అయితేఆ క్యాసెట్ చిక్కుకుపోయి పాడైపోవడంతో, ఆ ఫ్రస్టేషన్లో ఊరిలోని బరువు బాధ్యతల నుంచి తప్పించుకుని ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్ వస్తూంటాడు. తన చెల్లెలు ఎందుకు వెళ్తున్నావంటే మహేష్ ని కలవడానికి అని చెప్తాడు. అలానే హైదరాబాద్ లో రాంబాబు అన్న తన పల్లెటూరి పేరు పక్కనపెట్టి మహేష్ అని చెప్పుకున్నాడు. లావణ్యకి ఈ విషయం తెలిసి ఎక్కడ తనని కాదంటుందోనని భయపడుతూంటాడు. మరోపక్క లావణ్యకి ఎలాగైనా ఎన్నారై పెళ్ళికొడుక్కే ఇచ్చిచేయాలనుకునే ఆమె పిన్ని మందిర ([[ఝాన్సీ (నటి)|ఝాన్సీ]]) మహేష్ ని ఇంటర్వ్యూ చేసిచేస్తుంది. తన ఊరికి తీసుకువెళ్ళమంటే, తన అసలు పేరు ఎక్కడ బయటపడుతుందోనని తప్పించుకోవాలని చూస్తాడు, దాంతో అతని ప్రవర్తన అనుమానంగా ఉందని తేల్చి తిరస్కరిస్తుంది.<br />
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అష్టా_చమ్మా_(సినిమా)" నుండి వెలికితీశారు