చలసాని ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==సాహితీకారునిగా==
సాహిత్య రంగంలో ఆయన కృషి రెండు పాయలుగా సాగింది. సాహిత్యోద్యమాలను నిర్మించడంలో గత అర్ధ శతాబ్దంలో ఆయన కీలక పాత్ర పోషించారు. విరసం వ్యవస్థాపకులలో ప్రధానమైన వారు. ఆయన పేరు ఎవరు ప్రస్తావించినా విరసం ప్రసాద్ అంటారు. విరసం అన్న మాట దాదాపుగా ఆయన ఇంటిపేరై పోయింది. ప్రసాద్ సాహితీ సృజన తక్కువేమీ కాదు. కవిత్వం, వ్యాసాలు రాశారు. అవసరమైనప్పుడల్లా సామాజిక, రాజకీయ అంశాల మీదా రాశారు. అయితే ఉద్యమజీవులందరికి లాగే తన సృజనాత్మక శక్తిని ప్రోది చేసుకుని, పదిల పరచుకుని ఆ రంగంలో కీర్తి సంపాదించాలన్న దుగ్ధ ఆయనకేనాడూ లేదు. 1970లో విరసం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. 1985 నుంచి 88 వరకు మూడేళ్ల పాటు విరసానికి కార్యదర్శి. 1998 నుంచి 2002 వరకు అధ్యక్షులు. అయినా ఆయన సాహిత్యోద్యమంలో తనను తాను కార్యకర్తగానే పరిగణించే వారు. సాహితీ రంగం కూడా ఆయనను అదే దృష్టితో చూసింది. తొమ్మిదో తరతి విద్యార్థిగా ఉన్నప్పుడు 1947 “నవయుగ” సంచికలో “ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరి ఆయుధమోయ్” అన్న పాటతో మొదలెట్టిమొదలు పెట్టి కవిత్వం, సాహిత్య విమర్శ, ముందుమాటలు, సాహిత్య, రాజకీయ అంశాల మీద వ్యాసాలు దండిగానే రాశారు. చాలా కాలంపాటు ఒకటి రెండు అనువాదాలు తప్ప స్వతంత్ర రచనలుగా ప్రచురించడం మీద ఆయన దృష్టి ఎన్నడూ లేదు. 2008లో “సాహిత్య వ్యాసాలు”, 2010లో “చలసాని ప్రసాద్ రచనలు” వెలువడ్డాయి.<ref>[http://teluguglobal.com/chalasani-prasad-man-with-revoultionary-thoughts/ సాహిత్యోపజీవి చలసాని ప్రసాద్]</ref>
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/చలసాని_ప్రసాద్" నుండి వెలికితీశారు