రావిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[బొమ్మ:Raachakonda.jpg|thumb| రాచకొండ విశ్వనాధశాస్త్రి]]
'''రాచకొండ విశ్వనాధశాస్త్రి''' ([[జూలై 30]], [[1922]] - [[నవంబర్ 10]], [[1993]]) వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు. [[శ్రీకాకుళం]], [[విజయనగరం]], [[విశాఖపట్నం|విశాఖ]] జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు.
 
==తొలి జీవితము==
రావి శాస్త్రి, నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు [[1922]], [[జూలై 30]]న శ్రీకాకుళంలో జన్మించాడు. ఈయన స్వస్థలము [[అనకాపల్లి]] దగ్గర [[తుమ్మపాల]] గ్రామము. ఈయన తండ్రి, న్యాయవాది తల్లి, సహితీకారిణి.
[[దస్త్రం:Raavisastrisign.jpg|thumb|right|సంతకం]]
రావి శాస్త్రి [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (ఆనర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి [[1946]] లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని [[1950]]లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు.
Line 46 ⟶ 45:
ఆయన కథకుడే కాదు నటుడు కూడా . ఆయన వ్రాసిన ''నిజం'' నాటకంలోను, గురజాడ [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆరోజుల్లోనే, అంటే [[1962]] ప్రాంతంలో, వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.
 
"రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చేడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను" అన్నాడు రావిశాస్త్రి. 1922 జూలై 30న పుట్టి, పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాల నెదిరించి నెలల తరబడి జైలుపాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం.. తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించి [[1993]], [[నవంబర్ 10]] న రావిశాస్త్రి పెన్ను, కన్నుమూశాడు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రావిశాస్త్రి" నుండి వెలికితీశారు