మంచి మనసులు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
== విడుదల ==
=== ప్రచారం ===
[[దస్త్రం:Manchi manasulu advertisement.jpg|200px|thumbnail|కుడి|మంచి మనసులు సినిమా ప్రచారానికి బాపు వేసిన అడ్వర్టైజ్మెంట్]]
సినిమాకు ప్రముఖ చిత్రకారుడు [[బాపు]] పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు. పోస్టర్లు, స్టిల్స్ వంటివే కాకుండా సినిమా గురించి కార్టూన్లు కూడా గీసి పత్రికల్లో వేశారు. ఒకానొక ప్రచార కార్టూన్లో ఓ ఇల్లాలు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చినా బయటకు వెళ్ళిపోతున్న భర్తను ఈ సినిమాలోని "ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట, ఏ వూరు వెళతారు ఏదీ కాని వేళ" అన్న పాట వరుసలో "ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట! మంచిమనసులు మాట ఏంచేశారీ పూట" అంటుంది. ఇలాంటి వినూత్నమైన పబ్లిసిటీ సినిమా ప్రజాదరణ పొందడంలో తన వంతు కృషిచేసింది.