పూల రంగడు (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
=== అభివృద్ధి ===
సాధారణంగా సినిమా కథ రాసుకుని దానికి అనుగుణంగా పేరును పెట్టుకోవడం జరిగే రోజులవి. అయితే ఈ సినిమా విషయంలో పూర్తి రివర్సులో ముందుగా అక్కినేని నాగేశ్వరరావు ఇమేజ్ కి తగ్గ పేరు- పూలరంగడు అనుకుని, ఆపైన కథ రాయమని రచయితను పెట్టుకున్నారు. ముళ్లపూడి వెంకటరమణ సినిమాకి కథని అభివృద్ధి చేయడం ప్రారంభించాకా ఆయనకీ, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకీ వచ్చిన విభేదాల వల్ల దీనితో పాటుగా ఆదుర్తితో ఉన్న నాలుగైదు చిత్రాలను వదిలేశారు. ఎవరెంత వారించినా, బతిమాలినా వినకుండా మద్రాసు నుంచి విజయవాడ మారిపోయి పత్రికలో పనిచేయడం ప్రారంభించారు.ఆపైన [[గొల్లపూడి మారుతీరావు]]తో కథారచన సాగించారు. సహరచయిత్రిగా అప్పటికి [[బలిపీఠం (నవల)|బలిపీఠం]] నవలతో ప్రఖ్యాతిచెందిన [[ముప్పాళ్ళ రంగనాయకమ్మ]] కూడా పనిచేశారు. అది మధ్యలో ఉండగా గొల్లపూడి [[హైదరాబాద్]] [[ఆలిండియా రేడియో]] కు బదిలీ అయ్యారు.<br />
ఇంత జరిగినా కథ ఓ కొలిక్కి రాకపోతూండడంతో మళ్ళీ స్క్రిప్ట్ ముళ్ళపూడి వెంకటరమణ చేతికి వచ్చింది. ఆదుర్తిని, ఆయన సినిమాను వదిలేసి పత్రికలో పనికి విజయవాడ వెళ్ళగానే పి.పుల్లయ్య ఒప్పించి [[ప్రాణమిత్రులు]] సినిమాకి రాయించుకున్నారు. మళ్ళీ ఆదుర్తితో పనిచేయాలని, ఈ సినిమా కథ పూర్తిచేయాలని పిలిస్తే ముళ్లపూడి వెంకటరమణ అప్పటికి వారిద్దరి మధ్య వచ్చిన స్పర్థలు దృష్టిలో ఉంచుకుని కలసిపనిచేయడం కష్టమని క్షమించమన్నారు.
 
=== నటీనటుల ఎంపిక ===
"https://te.wikipedia.org/wiki/పూల_రంగడు_(1967_సినిమా)" నుండి వెలికితీశారు